కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలి: మువ్వా విజయ్
తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సభ్యులు మువ్వా విజయబాబు
కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలి: మువ్వా విజయ్
– తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సభ్యులు మువ్వా విజయబాబు
– 23వ డివిజన్ లో గడప గడపకూ కాంగ్రెస్
(ఖమ్మం-విజయంన్యూస్):
తెలంగాణలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలని ఇదే మనందరి లక్ష్యమని ఆ పార్టీ మేనిఫెస్టో కమిటీ సభ్యులు మువ్వా విజయబాబు నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పిలుపునిచ్చారు. గడప గడపకూ కాంగ్రెస్ ప్రచార కార్యక్రమాన్ని 23వ డివిజన్ ముస్తఫా నగర్ లో పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇంచార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి తో కలిసి గురువారం నిర్వహించారు. తెలంగాణలోని ప్రతి గడపకు ప్రభుత్వ సంక్షేమ ప్రయోజనాలు చేరాలనేదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఈ సందర్భంగా మువ్వా పేర్కొన్నారు. ప్రజలు ఆశీస్సులతో రాబోయే ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరుస్తామని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: హరీష్ రావు ఇది సిద్దిపేట కాదు ఖమ్మం: భట్టి విక్రమార్క
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మలీదు జగన్, మియా భాయ్, ఇమామ్ భాయ్, దుంపల రవి కుమార్, వాలూరి ఝాన్సీ, మందడపు తిరుమలరావు, బాణాల లక్ష్మణ్, చింతమళ్ళ గురుమూర్తి , శ్రీకళా రెడ్డి, కాంపాటి వెంకన్న, ప్రతిభ, చల్లా రామకృష్ణ రెడ్డి, చల్లా రామకృష్ణ, తోట ప్రసాద్, హరీష్, స్వరూప, ప్రసాద్, రాము, తిరుపతమ్మ, నరసింహారావు, సుజాత, అజీమ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
== బూడిదంపాడులో ప్రతి గడపకూ మువ్వా
రఘునాధపాలెం : గడపగడపకూ కాంగ్రెస్ ప్రచార కార్యక్రమాన్ని రఘునాధపాలెం మండలంలోని బూడిదంపాడు గ్రామంలో గురువారం సాయంత్రం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి గడపకూ మువ్వా విజయబాబు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అమలు చేయబోయే సంక్షేమ పథకాలను గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మువ్వాతో పాటు కార్పొరేటర్లు దుద్దుకూరి వెంకటేశ్వర్లు, మలీదు జగన్, సర్పంచ్ మందడపు తిరుమలరావు, రామ్మూర్తి, ఆరీఫ్, రాము, తుమ్మలపల్లి నర్సింహారావు, యన్నం లక్ష్మయ్య, మందా నాగేశ్వరరావు, షేక్ ఇమామ్, దుంపల రవి, శీతల హరినాధ్, బిక్కసాని లక్ష్మీ, కొప్పెర లక్ష్మీనారాయణ, స్వరూప, నర్సింహారావు, ప్రతిభ, మొగిలిశెట్టి నరేష్, రుడావత్ రమాదేవి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ తోనే సమస్యలకు శాశ్వత పరిష్కారం – విజయబాయి