కాంగ్రెస్ గూటికి మడత
–. జులై మొదటి వారంలో పార్టీలో చేరిక..?
–. నేడు సీతారామ థియేటర్ వెనుక క్యాంప్ కార్యాలయం ప్రారంభం
–త్వరలో శ్రీనివాస్ రెడ్డి తో భేటి..?
(ఇల్లెందు-విజయంన్యూస్)
బీసీ వర్గం లో బలమైన నాయకుడు, కోరం కనకయ్యకు అత్యంత సన్నిహితుడు మడత వెంకట్ గౌడ్ కాంగ్రెస్ గూటిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న మడత వెంకట్ గౌడ్ తన సతిమణితో పాటు అనుచరగణంతో త్వరలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతకుముందు 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కోరం కనకయ్యను కాంగ్రెస్ నుండి గెలిపించి సత్తా చాటాడు. అనివార్య కారణాలవల్ల ఇండిపెండింట్ గా మునిసిపాలిటీలో పోటీ చేయవలసి వచ్చింది. తన వర్గానికి పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు పలికినప్పటికీ స్వల్ప తేడాతో చాలా వార్డులు కోల్పోయాడు. గత మూడున్నర సంవత్సరాల నుండి రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. టిఆర్ఎస్ వేటు వేయటంతో రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండవలసి వచ్చింది. మూడున్నర సంవత్సరాలు దూరంగా ఉన్నప్పటికీ అనుచరులను కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చాడు.
ఇది కూడా చదవండి: పేదల రాజ్యం రావాలంటే కాంగ్రెస్ గెలవాలి: భట్టి
ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చాడు. శ్రీనివాస్ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నాడని అనుచరుల ద్వారా తెలుస్తుంది. ఈ నేపథ్యంపై విజయం ప్రతినిధి ప్రత్యేక కథనం
మడత వెంకట్ గౌడ్ కోరం కనకయ్య కు అత్యంత సన్నిహితుడు. యువత అంటే ఆయనకి ఇష్టం .యువత కోరిక మేరకు ఏది చేయాలన్న ఎంకరేజ్ చేస్తాడు. ఆటలు, పాటలతో పాటు దసరా ఉత్సవాలు,వినాయక ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాడు. మైసూర్ దసరా ఉత్సవాలను తలపించే విధంగా ఇల్లందు పట్టణంలో నిర్వహిస్తాడు. అనేక కళారూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో యువతను ఆకట్టుకుంటాడు. వారి సూచనలు మేరకే సాంస్కృతి క కళారూపాలు నిర్వహిస్తాడు .దసరా ఉత్సవాలు వచ్చాయంటే మడతను గుర్తుచేసుకుంటారు.యువతకు అంత ప్రాధాన్యత ఇస్తాడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా.బిసి వర్గంలో తనదైన ముద్ర సంపాదించుకున్నాడు. ఇక వినాయక చవితి ఉత్సవాలకు వస్తే జెకె కాలనీలో భారీ సెట్టింగ్ లతో ఉత్సవాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేనివిధంగా నిర్వహించిన ఘనత ఆయనకే దక్కింది. కొన్ని అనివార్య కారణాలవల్ల అభివృద్ధి కోసం టిఆర్ఎస్ పార్టీలో చేరారు. రాజకీయ రూప్ రేఖలు మారాయి. ప్రస్తుతం మూడున్నర సంవత్సరాలుగా ఏ పార్టీలో లేకుండా న్యూట్రల్ గా ఉన్నాడు.
ఇది కూడా చదవండి: షర్మిళ..విలీనామా..? విహారమా..?
గత పది సంవత్సరాల క్రితం వైస్ చైర్మన్ గా చేసిన అనుభవం ఆయన గొప్పతనం. ఆ తరువాత ఆయన సతీమణి మడత రమా వెంకట్ గౌడ్ ఐదు సంవత్సరాలు చైర్ పర్సన్ గా ఇల్లందు మున్సిపాలిటీకి సుపరిపాలన అందించారు .గత కొన్ని రోజుల నుంచి ఇల్లందు పట్టణం, మండలం ప్రజలు ఆయన రాజకీయ రీఎంట్రీ ఇవ్వడంతో ఎటువైపు మొగ్గు చూపుతరని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీని బట్టి చూస్తే మెజార్టీ ప్రజల అభిప్రాయం మేరకు కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉన్నట్లు స్పష్టమైతుంది. కోరం కనకయ్య మడతది ఇప్పటి అనుబంధం కాదు. నాలుగు దశాబ్దాలుగా వారిద్దరి మధ్య అన్నదమ్ముల అనుబంధం ఉంది. శ్రీనివాసరెడ్డి తీసుకునే నిర్ణయాన్నిబట్టి మడత నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు ఉంది శ్రీనివాస్ రెడ్డి ఎటువైపు ఉంటే అటు వైపు మొగ్గు చూపిస్తారని సన్నిహితుల ద్వారా తెలుస్తుంది.
— కాంగ్రెస్ పార్టీ కి జై కొడతాడా ?
నేడు స్వతంత్ర క్యాంపు కార్యాలయం ప్రారంభించనున్నాడు. ప్రస్తుతం ఏ పార్టీలో లేడు. మున్సిపల్ ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ బహిష్కరించింది. అప్పటినుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. మడత దంపతులిద్దరూ గత మూడున్నర సంవత్సరాల నుండి ఎటువంటి రాజకీయాలు చేయలేదు. ప్రస్తుతం ఇద్దరు రాజకీయ ప్రవేశం చేశారు. శ్రీనివాసరెడ్డి ఏ పార్టీ మారితే ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది ..జులై మొదటి వారంలో శీనన్న తీసుకునే నిర్ణయాన్ని బట్టి తన అభిప్రాయాన్ని ప్రకటించే అవకాశం ఉంది .
ఇది కూడా చదవండి: సీఎల్పీనేత భట్టి విక్రమార్క ను కలిసిన పొంగులేటి
అదేవిధంగా పొంగిలేటితో ప్రయాణించేటందుకు సంసిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. నేడు సీతారామ థియేటర్ వెనుక కొత్త క్యాంపు కార్యాలయం ప్రారంభిస్తున్నారు. ఓ సాధారణ వ్యక్తితో కార్యాలయాన్ని ప్రారంభించేందుకు సన్న హాలు చేస్తున్నాడు . గుడి ,మసీద్, చర్చ్ మత పెద్దలతో కార్యాలయాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేశాడు. ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే అటువైపే తన అడుగులని వేసేందుకు సిద్ధమవుతున్నాడు. దీన్నిబట్టి చూస్తే కాంగ్రెస్ గూటికి వెళ్ళటం ఖాయమని స్పష్టం అవుతుంది.
–. భారీ కృతజ్ఞత ర్యాలీ
2014లో తెలంగాణలో ఎక్కడా లేనివిధంగా సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిన సందర్భంగా కృతజ్ఞత ర్యాలీ చేసిన ఘనత మడత వెంకట్ గౌడ్ దక్కింది. నాటి రామిరెడ్డి వెంకటరెడ్డి ,సుధాకర్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఎంతోమంది కాంగ్రెస్ సీనియర్లంతా ఇల్లందులో నిర్వహించిన ర్యాలీకి ఆశ్చర్యపడ్డారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కృతజ్ఞత సభలు సమావేశాలు నిర్వహించారు. త్వరలో ఏ పార్టీ మారితే ఆ పార్టీ అధిష్టానంతో కార్యాలయాన్ని ప్రారంభించే అవకాశం ఉంది .కాంగ్రెస్ గూటికి మడత వెంకట్ గౌడ్ చేరిక దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తుంది.
ఇది కూడా చదవండి: రాహుల్ గాంధీతో ‘పొంగులేటి’ చర్చలు సఫలం..?
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏ పార్టీ తో సంబంధం లేకుండా స్వతంత్రంగా కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నాడు. రాబోయే రెండు వారాల్లో కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది. ఈలోపు పొంగిలేటితో భేటీ కానున్నాడు గత పది సంవత్సరాల నుండి జగదంబ సెంటర్లోని గాంధీభవన్ పేరుతో నియోజవర్గ కార్యాలయాన్ని ప్రారంభించాడు .ఆయనే కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చాడు. సొంత ఖర్చులతో ఆఫీసును మైంటైన్ చేస్తూ వచ్చాడు. ఇల్లందు వచ్చి నాలుగు దశాబ్దాలు అయినా ఇంతవరకు సొంత ఇల్లు లేదు. మడతను కలిసే జనసంచారం ఎక్కువ అవడంతో మరోమారు స్వతంత్రంగా కార్యాలయాన్ని నేడు ప్రారంభించనున్నాడు .శ్రీనివాసరెడ్డి వెంట నడుస్తాడు అని తెలుస్తుంది .గతంలో ఆ కార్యాలయానికి గాంధీభవంగా పిలిచేవారు ఆ తర్వాత తెలంగాణ భవన్ గా పిలిచారు. శ్రీనివాస్ రెడ్డి వెంటనే మెజార్టీ ప్రజల అభిమానం అభిప్రాయం మేరకు కాంగ్రెస్ల చేరేందుకు సిద్ధంగా ఉన్నాడని తెలుస్తుంది.
== భారీ అనుచర గణం
మడత రాజకీయాలకు మూడున్నర ఏళ్ళు దూరంగా ఉన్న ప్రజాతరణ చెక్కుచెదరలేదు. అయినా ఇల్లందుకు వస్తే మాట్లాడటానికి పోటా పోటీ పడతారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లందు పట్టణం. మండలంలో 12,500 మెజార్టీ తీసుకొచ్చాడు. ఈ దఫా మిగతా మండలాలపై గురిపెట్టే అవకాశం లేకపోలేదు. గార్ల, బయ్యారం, టేకులపల్లి, కామేపల్లి మండలాలలో ఉన్న కీలకమైన కార్యకర్తలు, నాయకులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు అందుకే నియోజకవర్గ క్యాంప్ కార్యాలయాన్ని నేడు ప్రారంభించనున్నాడు. భారీ ఎత్తున నేడు సభ జరగనుంది కీలకమైన ఈ సభలో రాజకీయ భవిష్యత్తుపై ఏం ప్రకటిస్తారని నియోజకవర్గ ప్రజలు ఎదురుచూస్తున్నారు.