Telugu News

కామ్రెడ్లతో కాంగ్రెస్ దోస్తి..బీఆర్ఎస్ తో కుస్తి

చేరో రెండు సీట్లకు అంగీకరించిన సీపీఐ, సీపీఎం

0

కామ్రెడ్లతో కాంగ్రెస్ దోస్తి..బీఆర్ఎస్ తో కుస్తి

== సీట్ల సర్దుబాటు చర్చలు సఫలం

== చేరో రెండు సీట్లకు అంగీకరించిన సీపీఐ, సీపీఎం

== భద్రాచలం, మిర్యాలగూడెం సీపీఎంకు కేటాయింపు..?

== కొత్తగూడెం, మునుగోడు సీట్లు సీపీఐకి కేటాయింపు

== చర్చల సఫలంతో సంతోషంలో కామ్రెడ్స్

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అస్తికరంగా మారాయి.. నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీని  శత్రువుగా చూసిన కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు దోస్తి కట్టాయి.. కమ్యూనిస్టు పార్టీలతో కాంగ్రెస్ దోస్తికి సిద్దమైయ్యాయి.. ఈ మూడు పార్టీల మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది. ఈ మేరకు సోమవారం జరిగిన చర్చలు సఫలమైయ్యాయి.. చేరో రెండు స్థానాలను ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించగా, కమ్యూనిస్టులు కూడా అందుకు అంగీకారం చెప్పడంతో కామ్రెడ్స్, కాంగ్రెస్ దోస్తి బలపడినట్లైంది. దీంతో రాబోయే ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి.  పూర్తి వివరాల్లోకి వెళ్తే  తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది.

ఇది కూడా చదవండి: ఐదు రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా

గతం కొద్ది నెలల క్రితం మునుగోడు ఎన్నికల్లో అధికారపార్టీతో దోస్తి కట్టిన సీపీఎం, సీపీఐ పార్టీలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కలిసి పనిచేస్తామని ధీమా వ్యక్తం చేశాయి. కానీ సీఎం కేసీఆర్ కమ్యూనిస్టులతో దోస్తికి కటీఫ్ చెప్పడంతో చేసేది లేక కమ్యూనిస్టులు కాంగ్రెస్ దోస్తికి సిగ్నల్ ఇచ్చాయి. కాగా వచ్చిన అవకాశాన్ని సద్వీనియోగం చేసుకునేందుకు మక్కువ చూపిన కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులతో దోస్తికి పచ్చజెండా ఊపింది. దీంతో కొద్ది రోజుల పాటు చర్చలు జరగ్గా, సీపీఐ 5 స్థానాలను ఇవ్వాలని, సీపీఎం 4 స్థానాలు ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలని డిమాండ్ పెట్టాయి. దీంతో చర్చలు జరుగుతున్న తరుణంలో చేరో రెండు స్థానాలను కేటాయిస్తామని కాంగ్రెస్ తెల్చి చెప్పిగా, కమ్యూనిస్టులు కొంత మొండికేయడంతో కాంగ్రెస్ వదులుకునేందుకు సిద్దమైంది.  ఈ క్రమంలో సీపీఎం, సీపీఐ పార్టీ రాష్ట్ర నాయకత్వం మరోసారి అత్యవసరంగా సమావేశం నిర్వహించుకుని కాంగ్రెస్ ప్రతిపాధనలకు ఓకే చెప్పింది. అయితే నియోజకవర్గాల కేటాయింపు విషయంలో మరోసారి గందరగోళం ఏర్పడింది. సీపీఎం పార్టీ పాలేరు, భద్రాచలం, మిర్యాలగూడెం  స్థానాల్లో ఏవైనా రెండు కేటాయించాలని కోరగా, సీపీఐ పార్టీ కొత్తగూడెం, మునుగోడు, వైరా స్థానాల్లో రెండు కేటాయించాలని కాంగ్రెస్ ముందు ప్రతిపాదనలు పెట్టారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్

ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కచ్చితంగా ఒక స్థానం ఉండాలని కోరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘంగా చర్చలు నిర్వహించి చివరికి సీపీఎం కు భద్రాచలంతో పాటు మిర్యాలగూడెం, సీపీఐ పార్టీకి కొత్తగూడెంతో పాటు మునుగోడు సీటును కేటాయించేందుకు అంగీకరించినట్లు సమాచారం. అయితే భద్రాచలంలో కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ సీటు కాగా భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య పరిస్థితి ఏంటనేది..? ప్రశ్నార్థికంగా మారింది..

== పోడేం వీరయ్య పరిస్థితి ఏంటీ..?

భద్రాచలం, పాలేరులో ఏదో ఒక స్థానాన్ని కేటాయించాలని సీపీఎం పట్టుబట్టగా చివరికి భద్రాచలం ను వదిలేసేందుకు సిద్దమైన కాంగ్రెస్ పార్టీకి మరో తలనొప్పి వచ్చిపడింది.  భద్రాచలం నియోజకవర్గానికి పోడెం వీరయ్య ప్రస్తుతం ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. అధికార పార్టీ నుంచి ఎంత ఒత్తిడి వచ్చినప్పటికి ఆయన పార్టీ మారలేదు. పైగా సీఎం కేసీఆర్ పై పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు పెట్టారు. అంతే కాకుండా భద్రాచలంలో పార్టీని బతికించుకుంటూ, రక్షించుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం పార్టీ పుల్ స్టాంగ్ గా ఉంది. అయితే అలాంటి భద్రాచలం స్థానాన్ని సీపీఎం కు కేటాయించినట్లు వస్తున్న ప్రచారాన్ని భద్రాచలం కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: రేపు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటన

కాంగ్రెస్ కు  సిట్టింగ్ స్థానమైన భద్రాచలంను ఎలా సీపీఎంకు కేటాయిస్తారని అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర కాంగ్రెస్ అదిష్టానంపై అగ్రహించినట్లు తెలిసింది.  దీంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సీపీఎంకు బుజ్జగించే పనిలో పడినట్లు సమాచారం. భద్రాచలం మినహా ఏ నియోజకవర్గం ఇవ్వమని అడిగినా ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే భధ్రాచలం బదులుగా పాలేరు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. దీంతో పాలేరుకు ఇప్పటికే పార్టీలో చేరిన వారికి కేటాయించడం జరిగిందన్నారు. మరో స్థానాన్ని కోరుకోవాలని కాంగ్రెస్ పార్టీ మరో ప్రతిపాదనను పెట్టినట్లు తెలుస్తోంది. కాగా ఈ అంశంపై సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ అత్యవసరంగా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. అయితే కమ్యూనిస్టులతో పొత్తు చర్చలు సఫలమైనప్పటికి.. దేవుడు వరమిచ్చిన, పూజారి వరమివ్వని చందంగా తయారైంది. చూద్దాం సీపీఎం రాష్ట్ర కమిటీ అడుగు వెనక్కి వేసి మరో నియోజకవర్గం తీసుకుంటారా..? లేదంటే కచ్చితంగా భద్రాచలం కోసం పట్టుబడతారా..? అనేది వేచి చూడాల్సిందే..;?