తెలంగాణలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే
== విలేకర్ల సమావేశంలో పువ్వాళ్ళ దుర్గాప్రసాద్
ఏన్కూరు మే 15 (విజయం న్యూస్ ) తెలంగాణలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ దుర్గాప్రసాద్ అన్నారు.
ఇది కూడా చదవండి:- బిఆర్ఎస్ కు ఓట్లు అడిగే హక్కు లేదు: భట్టి
సోమవారం టీ యల్ పేట గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీ విజయ డంక మోగించిందో, అదేవిధంగా రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ డంక మోగిస్తుందని అన్నారు. పార్టీ కార్యకర్తలందరూ కష్టపడి పని చేయాలని, పార్టీకి పునాది కార్యకర్తలేనన్నారు. రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చిందన్నారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి:- కాంగ్రెస్ ని విమర్శిండం సిగ్గు చేటు: పువ్వాళ్ల
ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు మాలోతు రాందాస్ నాయక్,మద్దినేని రమేష్,వేముల కృష్ణ ప్రసాద్, స్వర్ణ నరేంద్ర కుమార్, పాశం శ్రీనివాసరావు,కొప్పుల ప్రభావతి రెడ్డి, కురువెళ్ల గోపయ్య తదితరులు పాల్గొన్నారు