Telugu News

రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే: నాగా సీతారాములు

కొత్తగూడెంలో కొనసాగుతున్న గడపగడపకు కాంగ్రెస్ యాత్ర

0

రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే: నాగా సీతారాములు

== కొత్తగూడెంలో కొనసాగుతున్న గడపగడపకు కాంగ్రెస్ యాత్ర

(కొత్తగూడెం-విజయంన్యూస్)

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆళ్ల మురళి, తూము చౌదరి అన్నారు. మంగళవారం లక్ష్మిదేవిపల్లి మండలంలోని సంజయ్ నగర్ పంచాయతీలో స్థానిక నాయకుల ఆధ్వర్యంలో గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీలను రైతులకు,యువతకు ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంచి వివరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు వరంగల్ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, చేవెళ్ల దళిత-గిరిజన డిక్లరేషన్ అమలు చేసి రైతు, యువత, దళితులు, గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడి కార్మికులకు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ బాధితులకు, పైలేరియా డయాలిసిస్ పేషంట్లకు నెలకు రూ. 4 వేల పెన్షన్ ఇస్తామన్నారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని మరోసారి హామీనిచ్చారు.

ఇది కూడా చదవండి:  గాంధీభవన్ కు  క్యూ కట్టిన ఖమ్మం కాంగ్రెస్ నేతల

2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయడంతోపాటు రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5 లక్షల సాయం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ భద్రమ్మ, పూనెం శ్రీనివాస్,  మైనార్టీ నాయకులు గౌస్ భాయ్, భావ్ సింగ్, మతిన్ బొమ్మగాని భాస్కర్, అయూబ్ ఖాన్, కొలుపుల అఖిల్, హరీష్ పవన్, రాము, సురేష్, ప్రేమ్ చందు, చిన్న బాలు, సందీప్, చిన్న, సురేష్, బాబు, ఈసుబ్, అయూబ్ ఖాన్, మురళి, ఉప్పల హేమంత్ యాదవ్,  సరిత, నాగేశ్వరరావు, సత్యనారాయణ రెడ్డి, కనకరాజు,  కాకా లక్ష్మయ్య, చిమట నాగేశ్వరావు, నరేష్, కుమార్, ఉదయ్ కుమార్, మహిళా నాయకురాళ్ళు, సరోజినీ, నాగమ్మ ,  మహిళా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

== బీసీ డిక్లరేషన్ కమిటీ సభ్యుడిగా నాగా సీతారాములు

బీసీ డిక్లరేషన్ పై పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కమిటీని టీపీసీసీ వేసింది. ఈ కమిటీలో సభ్యుడిగా టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములుకు చోటు కల్పించడం పట్ల కొత్తగూడెం నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. కాగా ఈ బీసీ కమిటీ బీసీ డిక్లరేషన్ పై పొందుపర్చాల్సిన అంశాలను చూసుకుంటుంది. ఈ నెల 17 లోగా అన్ని డిక్లరేషన్లను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. ఇందులో భాగంగానే పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కమిటీని టీపీసీసీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఆరుగురిని కో చైర్మెన్లుగా, 9 మంది అడ్వైజరీలను, 1 ప్రోగ్రాం కన్వీనర్ తో పాటుగా  37 మంది బీసి నాయకులకు చోటు కల్పించింది.

ఇది కూడా చదవండి: ఖమ్మంలో కాంగ్రెస్ టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నదేవరంటే..?