Telugu News

రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే : పొంగులేటి

టీపీసీసీ ప్రచార కమిటీ కో-చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు

0
రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే : పొంగులేటి
== చుంచుపల్లి, కొత్తగూడెం మండలాల్లో భారీ చేరికలు
== కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పొంగులేటి…
== టీపీసీసీ ప్రచార కమిటీ కో-చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు
(కొత్తగూడెం-విజయం న్యూస్) 
 ప్రజలు తలుచుకుంటే జరగనీదంటూ ఏదీ లేదని ఎందరికో అధికారం ఇచ్చారని మరెందరికో అధికారం కూల్చారని, ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలనీ వారి ఆశీస్సులు ఉంటే ఏదైనా సాధ్యమేనని టీపీసీసీ ప్రచార కమిటీ కో-చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు,  రాష్ట్ర నాయకులు ఊకంటి గోపాలరావు, తూము చౌదరి, ఆళ్ళ మురళి అన్నారు. చుంచుపల్లి మండలంలోని చుంచుపల్లి తండా, కొత్తగూడెం మున్సిపాలిటీ 5 వార్డ్ లలో 150 కుటుంబాల నుండి సుమారు 400 మంది పలు పార్టీల ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జరిగే అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలకు ఆకర్షితులై ప్రజలు స్వచ్చందంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందనీ వివరించారు. చుంచుపల్లి తండా రైతులు తమ పంట పొలాలకు వెళ్లాలంటే గోధుమ వాగు ఉండటం వల్ల సుమారు 6 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తుందని పొంగులేటికి వినతిపత్రం ఇవ్వగా కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఖచ్చితంగా గోధుమ వాగుపై చాప్టా ఏర్పాటు కోసం కృషి చేస్తానన్నారు… అలాగే కొత్తగూడెం మున్సిపాలిటీలో ఉన్నప్పటికీ తాముంటుంన్న ప్రాంతంలో కనీస సౌకర్యాల కోసం ఇబ్బంది పడుతున్నామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ ప్రాంతాన్ని దత్తత తీసుకోవాలని 5 వార్డ్ యువత కోరగా స్పందించిన పొంగులేటి తానే స్వయంగా దగ్గరుండి మరి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తానన్నారు… ఈ సందర్బంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటామని కచ్చితంగా రానున్న ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీని కొత్తగూడెం నియోజకవర్గంలో, రాష్ట్రంలో అధికారం రావడానికి తమ వంతుగా కృషి చేస్తామని అన్నారు…
== డబ్బులు ఎవరిచ్చిన తీసుకోండి ఓటు కాంగ్రెస్ కు వేయండి : పొంగులేటి*
ఎన్నికల సమయంలో అధికార పార్టీ నాయకులు డబ్బుల సంచులతో వస్తారని, ఆ డబ్బులు వాళ్ల సొంత డబ్బులు కావని ప్రజలు టాక్క్స్ రూపంలో కట్టిన డబ్బులన్నారు… డబ్బులు ఎవరు ఇచ్చిన తీసుకోని ఇందిరమ్మ రాజ్యం కోసం కృషి చేస్తున్న రాహుల్ గాంధీని దీవించడం కోసం కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలన్నారు.  కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని కార్యకర్తలు అందరూ తమ వంతుగా ప్రయత్నం చేయాలనీ, ప్రజా సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు..
  పార్టీలో చేరిన వారిలో చుంచుపల్లి తండా నుండి  ఆధ్వర్యంలో భూక్యా చిన్నా, భూక్యా రాందాస్, కున్సోత్ భిక్కు, కున్సోత్ దేవదాస్,కున్సోత్ రవి, మాలోత్ తిరుపతమ్మ, భూక్యా అరుణ, తదితరులు  5 వార్డు నుండి షోయబ్, ఉమర్, సంతోష్, వినోద్, రాజు, రఘు, సోని, రాధ, జయ, తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు ఆకునూరి కనకరాజు, పూనెం శ్రీనివాస్, మైనార్టీ నాయకులు గౌస్ భాయ్, అయూబ్ ఖాన్, ఖలీల్ భాయ్, గాలి వెంకన్న, కనకరాజు, సత్యనారాయణ రెడ్డి, సుప్రియ ఆకులూరి, సతీష్, కలకోటి రాజు, మహేష్, అడప నవీన్, ఖమర్, వెంకన్న, కున్సోత్ కిషన్, భూక్యా హేమ్లా, నాగేశ్వరరావు, నిరంజన్ రెడ్డి, శ్యామ్, నరేష్, పండు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.