Telugu News

రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే : పొంగులేటి 

గడప గడపకూ పొంగులేటి ప్రసాద్ రెడ్డి ...!

0
రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే : పొంగులేటి 
== గడప గడపకూ పొంగులేటి ప్రసాద్ రెడ్డి …!
==  కూసుమంచి మండలం గట్టుసింగారం లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం*
(కూసుమంచి-విజయం న్యూస్)
రాబోయే ఎన్నికల్లో 78స్థానాలను గెలిచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. కూసుమంచి మండలంలోని గట్టుసింగారం, జుజ్జులరావుపేటలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాన్ని  గ్రామాల్లో శుక్రవారం నిర్వహించారు.

ఇది కూడా చదవండి:-:ఎన్నికలకు ముహూర్తం ఖరారైనా..?

== ఖమ్మం రూరల్ లో పొంగులేటి ప్రసాద్ రెడ్డి పర్యటన
ఖమ్మం రూరల్ : కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఖమ్మం రూరల్ మండలంలో శుక్రవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా పెద్దతండాలో మృతి చెందిన ఉర్సు శ్రీను మృతదేహాన్ని, నాయుడుపేట లో మృతి చెందిన పలసల నర్సమ్మ మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ని తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థించారు. అదేవిధంగా ఆయా గ్రామాల్లో పర్యటించి పలు బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ఆర్ధిక సాయాలను కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అజ్మీర అశోక్ నాయక్, బానోత్ భాస్కర్, బానోత్ కిషోర్, బానోత్ హరి, ధరావత్ నారాయణ, యశోదమ్మ, మల్లయ్య, జగదీష్, సంగయ్య, నరేష్, బానోత్ దివ్య, బానోత్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.