రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే: పువ్వాళ్ళ
== 48వ డివిజన్ నుంచి భారీగా చేరికలు
== కండువ కప్పి స్వాగతం పలికిన జిల్లా, నగర కమిటీ అధ్యక్షులు
(ఖమ్మం-విజయంన్యూస్)
తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నగర కమిటీ అధ్యక్షుడు ఎం.డీ.జావిద్ జోస్యం చెప్పారు. ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారని, ఆ రెండు చోట్ల ప్రకటన చేసినప్పుడే ఆయన తన ఓటమిని, తన పార్టీ ఓటమిని అంగీకరించారని అన్నారు. ఖమ్మం నగరంలోని 48 వ డివిజన్ ఇంచార్జీ తవిడబోయిన రవీంద్ర డివిజన్ అద్యక్షులు బోజెడ్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కి చెందిన నాయకులు మేచిని రామకృష్ణ, షేక్ జాహిర్, షేక్, నావిద్ షేక్ శంశుద్దిన్, ప్రతపనీ సాయి ప్రసాద్, వార శివ, తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాయలం సంజీవరెడ్డి భవనంలో ఏర్పాటు చేసిన జాయినింగ్ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్, ఖమ్మం నగర అధ్యక్షుడు మహమ్మద్ జావిద్ కండువాలు కప్పి పార్టీ లోకి
ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా తయారైందని, సీఎం కేసీఆర్ ఎన్ని మాయమోసాలు చేసిన రాబోయే ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. 90 స్థానాలతో అద్భుతమైన విజయం సాధిస్తామని తెలిపారు. కార్యకర్తలందరు గ్రామాల్లోకి, ప్రజల్లోకి వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ జిల్లా అధ్యక్షుడు హుస్సెన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పిట్టల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు..