Telugu News

కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులే విజయానికి నాంధి: శ్రీనివాస్ రెడ్డి

కార్డులను పంపిణీ చేసిన టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మద్ది శ్రీనివాస్ రెడ్డి

0

కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులే విజయానికి నాంధి: శ్రీనివాస్ రెడ్డి

== కార్డులను పంపిణీ చేసిన టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మద్ది శ్రీనివాస్ రెడ్డి

(నేలకొండపల్లి-విజయంన్యూస్)

కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అద్భుత ఆరు పథకాల వల్లనే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి నాంధి కాబోతున్నాయని, ఎవరు ఆపిన కాంగ్రెస్ అధికారంలోకి రావడ ఖాయమని టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మద్ది శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కూసుమంచి మండలంలోని జీళ్ళచెరువు గ్రామంలో  గణేష్ మండపాల దగ్గర, తన వంతుగా ఆర్థిక సాయం అందజేశారు. హైదరాబాద్ విజయభేరి బహిరంగ సభలో,  సోనియా గాంధీ ప్రకటించిన కాంగ్రెస్ గ్యారంటీ కార్డులను టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర ఛార్జ్ షీట్ కమిటీ సభ్యులు డాక్టర్ మద్ది  శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు.

ఇది కూడా చదవండి: రేపు జిల్లాకు తుమ్మల రాకా

  ఈ సందర్భంగా మద్ది మాట్లాడుతూ,  కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన 100 రోజులు లోపల,  కాంగ్రెస్ గ్యారంటీ కార్డు లోని మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం, చేయూత అంశాలను తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అమలుపరుస్తుందని  తెలియజేశారు.  కెసిఆర్ అధికారంలో వచ్చాక తెలంగాణ పేరు చెప్పి,  తెలంగాణ సమాజాన్ని తన కుటుంబానికి దోసి పెట్టారని,  ప్రభుత్వ పథకాలన్నీ కేసీఆర్ కుటుంబానికి , బిఆర్ఎస్ నాయకులకు జేబులు నింపే కార్యక్రమాలు అయ్యయని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బిఆర్ఎస్ కి కేంద్రంలో బిజెపికి,  ప్రజలు బుద్ధి చెప్పి  కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని  అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అంజయ్య, ప్రభాకర్, దంతాల శ్రీనివాస్, అంబాల శ్రీనివాస్, పెండ్ర ప్రసాద్, సత్యం, రమేష్, వెంకన్న, వెంకటేశ్వర్లు, నగేష్, ఉపేందర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: చంద్రబాబు కు రిమాండ్ పొడిగింపు