Telugu News

గడప గడపకూ పొంగులేటి ప్రసాద్ రెడ్డి …!

0
నేలకొండపల్లిలో గడప గడపకూ  కాంగ్రెస్
== ఇంటింటా తిరుగుతున్న పొంగులేటి ప్రసాద్ రెడ్డి 
(నేలకొండపల్లి-విజయం న్యూస్)
గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ఆ పార్టీ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి నేలకొండపల్లి మండలంలోని బుద్ధారం, రాయిగూడెం గ్రామాల్లో ఆదివారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి గడపకూ తిరుగుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అమలు చేయబోయే సంక్షేమ పథకాలను కరపత్రాన్ని అందజేసి వివరించారు. వృద్ధులను, వికలాంగులను, మహిళలను, చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారం చేపట్టాక ఆ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి  ఉంటుందని తెలిపారు. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని రాబోవు రెండు నెలల్లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే అధికారమని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలోని అన్ని ప్రధాన సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.