Telugu News

కాంగ్రెస్ దీక్షలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హాట్ కామెంట్స్

అందరికి సమాన హక్కులు కల్పించిన గ్రంధం భారత రాజ్యాంగం..

0

కాంగ్రెస్ దీక్షలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హాట్ కామెంట్స్

స్వాతంత్ర్య భారతదేశంలో ఏడూ దశాబ్దాల తరువాత రాజ్యాంగ పై ఇంత ప్రమాదకరమైన వ్యాఖ్యలు చేసినవి లేవు..

కొత్త రాజ్యాంగం రావాలి అని ముఖ్యమంత్రి చెప్పడం తెలంగాణ ప్రజలుగా అందరం సిగ్గుపడాలి..

అందరికి సమాన హక్కులు కల్పించిన గ్రంధం భారత రాజ్యాంగం..

రాజ్యాంగం లేకపోతే రాజులు, రాజ్యాలు మాత్రమే ఉండేవి..

దళితులు,గిరిజనులు,రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కాదు..

రాష్ట్ర కాంగ్రెస్ పక్షాన ..మీరు చెప్పాల్సింది క్షమాపణలు కాదు..మీ ఆలోచన విధానం అర్ధమైంది

నువ్వు ఎన్నికలకు ,పాలన చేయడానికి అనర్హుడివి..

భారత రాజ్యాంగం పనికి రాదని చెప్పిన ముఖ్యమంత్రి ని తొలగిస్తే తప్ప భారత రాజ్యాంగం కు గౌరవం దక్కదు…

మీ పదవులు పనికి రావని చెప్తున్నా..కేసీఆర్ వెనుక నిలబడతారా…

భారత రాజ్యాంగం పై మాట్లాడిన ముఖ్యమంత్రి ని బూతులు కాదు ఎం చేసిన తప్పు లేదు..

భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉంది..

రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పక్షాన మండల,జిల్లా స్థాయి ప్రత్యేక కార్యాచరణ తీసుకుందాం..

అందరికి భారత రాజ్యాంగం అందించేలా చేద్దాం..

ప్రతి సమస్యకు పరిష్కారం భారత రాజ్యాంగం చదవడం..

రాష్ట్ర కాంగ్రెస్ పక్షాన అంబెడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేద్దాం..

భారత రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే టీఆరెస్ నేతలు ఆపార్టీని వదిలి రావాలి…

రాజ్యాంగం పై ఆరు మాసాల కార్యక్రమం చేద్దాం..