Telugu News

ఖమ్మంలో దూకుడు పెంచిన కాంగ్రెస్

కీలక నేతల ఇండ్లకు తుమ్మల, పొంగులేటి

0

ఖమ్మంలో దూకుడు పెంచిన కాంగ్రెస్

== పెద్దలపై ఇద్దరు నేతల గురి

== కీలక నేతల ఇండ్లకు తుమ్మల, పొంగులేటి

== పార్టీలో చేరికలపై కసరత్తు..దూసుకుపోతున్న ఆ ఇద్దరు నేతలు

== అసంతృప్తులతో భేటి.. బుజ్జగింపులు.. అత్యవసర సమావేశాలు..

== జోష్ లో కాంగ్రెస్ శ్రేణులు

(ఖమ్మప్రతినిధి-విజయంన్యూస్)

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ రసవత్తరంగా మారుతోంది.. రోజురోజుకు రాజకీయ మలుపులు విశ్లేషకులను సైతం ముప్పుతిప్పలు పెడుతున్నట్లే కనిపిస్తోంది.. ఎవరు ఊహించని విధంగా రాజకీయ వ్యాహానికి పదును పెట్టిన కాంగ్రెస్ పార్టీ, అదే స్థాయిలో దూకుడు పెంచింది. ఇష్టమైన నియోజకవర్గాలను కాకుండా గెలిచే నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించే విషయంలో అద్భుత నిర్ణయం తీసుకున్న అదిష్టాన నిర్ణయాన్ని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..

ఇది కూడా చదవండి:- ఖమ్మంలో పెద్దలను కలిసిన తుమ్మల

అంతేకాకుండా అభ్యర్థుల ప్రకటనతో కొత్త జోష్ లోకి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ అదే వేగంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దూకుడును పెంచింది..  ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆగ్రనేతలు, జనబలం కల్గిన రాజకీయ వ్యూహాకర్తలైన  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ, ఎన్నికల ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల వ్యాహానికి పదును పెట్టారు. ఎవరు ఊహించని విధంగా ఖమ్మం నగర నడిబొడ్డున హాల్ చల్ సృష్టించారు.  రాజకీయ మార్పులకు తెరలేపడంతో ఒక్కసారిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ ఉలిక్కిపడింది. కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపిన ఆ ఇద్దరు నేతలు అదే వేగంతో ముందుకు కదిలారు.. చాలా వ్యూహాలకు పదును పెడుతూ ఎవరు ఊహించని విధమైన అడుగులేస్తూ ముందుకు సాగుతున్నారు..

== చేరికలపై దృష్టి

ఉమ్మడి ఖమ్మం జిల్లానే టార్గెట్ గా చేసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందుకు కీలక నియోజకవర్గంపై గురిపెట్టారు.. కుంబాన్ని కొడితే.. కొమ్మలు అవే రాలిపోతాయనే పెద్దల సామెతను ఫాలో అవుతున్నఆ ఇద్దరు నేతలు  తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముందుగా ఖమ్మం నగరంపై గురిపెట్టారు.

ఇది కూడా చదవండి:- బీఆర్ఎస్ నేతలంతా బంధి పొట్లేనా..? : కాంగ్రెస్ 

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం నియోజకవర్గంలో కీలక నాయకులకు టచ్ లోకి వెళ్తూ అసంతృప్తిగా ఉన్న నేతలపై గురి పెట్టారు. అందులో భాగంగానే మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ తో పాటు ముగ్గురు బీఆర్ఎస్ పార్టీ  కార్పోరేటర్లు కమర్తపు మురళీ, చావా నారాయణరావు, సైదారావులను ఉన్నఫలంగా పార్టీ మార్పించి కాంగ్రెస్ పార్టీలో చేర్పించారు. దీంతో ఒక్కసారిగా ఖమ్మం జిల్లా ఉలిక్కిపడింది. బీఆర్ఎస్ నేతలు బెంబెలేత్తారు.. ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే పొంగులేటి, తుమ్మల ఇద్దరు కలిసి కీలక నేతలను మూసేశారు. దీంతో పువ్వాడ అజయ్ హుటాహుటిన హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చి వారి కార్పోరేటర్లతో అత్యవసర సమావేశం నిర్వహించి కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

== పెద్దల ఇండ్లకు తుమ్మల, పొంగులేటి

ఖమ్మం నియోజకవర్గంలో వివిధ పార్టీలకు చెందిన కీలక నాయకులుగా ఉన్న వారి ఇండ్లకు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిసి తిరుగుతున్నారు. వారి ఇండ్లకు వెళ్లి కలిసి మాట్లాడుతున్నారు. సహాకరించాలని కోరుతున్నారు.

ఇది కూడా చదవండి:- ఖమ్మం బీఆర్ఎస్ లో భారీ కుదుపు

కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, తెలుగుదేశం పార్టీ, ప్రముఖ వైద్యులను కూడా మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడుతున్నారు. కులసంఘాలకు చెందిన కీలక నాయకులను సైతం కలుస్తున్నారు. ఖమ్మంలో అలజడి సృష్టిస్తున్నారనే చెప్పాలి.

== జావిద్ తో తుమ్మల.. రాయలతో పొంగులేటి భేటి

ఖమ్మం నియోజకవర్గంలో టిక్కెట్ ఆశించి పదేళ్ల పాటు పార్టీ కోసం పని చేసిన ఖమ్మం నగర కమిటీ అధ్యక్షుడు మహ్మాద్ జావిద్ ను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నియోజకవర్గంలో పదేళ్ల పాటు పార్టీని నమ్ముకుని కోట్లలో ఖర్చు చేసి క్యాడర్ ను కాపాడుకుని సీటు కోసం ప్రయత్నం చేసిన రాయల నాగేశ్వరరావును పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  మర్యాదపూర్వకంగా తమ ఇంటికి వెళ్లి కలిశారు. పార్టీ కోసం క ష్టపడి పనిచేశారని,అనుకొని పరిస్థితుల్లో పార్టీలో చేరడం, కచ్చితంగా పోటీ చేయాల్సిన పరిస్థితి రావడం జరిగిందని, అందుకే మీకు సీటు విషయంలో నష్టం జరిగిందని మేము భావిస్తున్నామని తెలిపారు.

ఇది కూడా చదవండి:- కాంగ్రెస్ తొలి జాబితా విడుదల

కచ్చితంగా రాబోయే కాలంలో మీ కష్టానికి ఫలితంగా మీ పనికి తగిన గుర్తింపును ఇచ్చేందుకు మేము సిద్దంగా ఉన్నామని, కలిసి పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేద్దామని కోరారు. దీంతో ఆ ఇద్దరు నేతలు మాట్లాడుతూ మాతో పాటు మమ్మల్ని నమ్మి మా కోసం, పార్టీ కోసం పక్కవారితో పోట్లాడి కొట్లాడి నిలబడిన కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందరు కలిసి పోయే విధంగా పనిచేస్తే పార్టీ కోసం పనిచేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అవమానించే విధంగా ప్రదర్శిస్తే కనీసం ఇంట్లోనైనా కుర్చుంటామని, పిలిచి అవమానించోద్దని కోరారు. దీంతో స్పందించిన తుమ్మల, పొంగులేటి మీకు, కాంగ్రెస్ ను నమ్ముకుని పనిచేసిన కార్యకర్తలందరికి తగిన గుర్తింపును కచ్చితంగా ఇస్తామని హామినిచ్చారు. అలాగే పార్టీలో అసంతప్తులను కలిసి బుజ్జగిస్తున్నారు. వారి నివాసాలకు వెళ్లి కలిసి మాట్లాడి ఎన్నికల ప్రచారానికి తీసుకోస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్ట్టీలో నూతన ఉత్సహాం కనిపిస్తోంది..

ఇది కూడా చదవండి:- బీఆర్ఎస్ కు బాలసాని రాజీనామా..

ఒక వైపు తుమ్మల, మరో వైపు పొంగులేటి, ఇంకో వైపు భట్టి విక్రమార్క వర్గీయులు, రేణుక చౌదరి వర్గీయులను కలుపుకుని వెళ్లే ప్రయత్నం జరుగుతుండటంతో కార్యకర్తల్లో ఎనలేని ఉత్సహం వస్తుందనే చెప్పాలి. ఇలాగే ఎన్నికల మొత్తం  కొనసాగితే కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని విజయం తథ్యమని అందరు భావిస్తున్నారు. చూద్దాం వర్గపోరుకు నిలయమైన కాంగ్రెస్ పార్టీలో అందరు కలిసి పనిచేస్తారో..? మళ్లీ కుక్క తోక వంకరే అన్నట్లుగా ప్రవర్తిస్తారో వేచి చూడాల్సిందే..?