Telugu News

ఖమ్మంలో కాంగ్రెస్ విన్నూతన నిరసన

== కోడిని చెట్టుకు కట్టి భోజనం చేసిన కాంగ్రెస్ నేతలు == నడిరోడ్డుపై వంటావార్పు == కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

0

ఖమ్మంలో కాంగ్రెస్ విన్నూతన నిరసన
== కోడిని చెట్టుకు కట్టి భోజనం చేసిన కాంగ్రెస్ నేతలు
== నడిరోడ్డుపై వంటావార్పు
== కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)
దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రో, డీజిల్, గ్యాస్ ధరలను నిరసిస్తూ పీసీసీ పిలుపుమేరకు ఖమ్మం జిల్లా డీసీసీ, మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం ఖమ్మం నగరంలో విన్నూతనంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవ రెడ్డి భవనం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని నిరసన ప్రదర్శన నిర్వహించారు. గ్యాస్ బండలను మోస్తూ, మోటర్ సైకిళ్లను నడిపిస్తూ, లాంతర్లను పట్టుకుని నిరసన తెలిపారు.

also read :- *ఎస్ఐ కొట్టింది అంటూ మనస్తాపంతో ఒకరి మృతి…*

అనంతరం పాత బస్టాండ్ సమీపంలో ప్రధాన రహదారిపై కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అక్కడే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. వంటలు చేసి నాయకులు అక్కడే అల్పాహారం తీసుకున్నారు. అయితే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయలు, చికెన్, మటన్ ధరలకు నిరసనగా చెట్టుకు కోడిని కట్టేసి అల్పహారం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పవ్వాళ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుండి కోరుకుంటున్న ప్రజలపై నిత్యావసర సరుకుల ధరలతోపాటు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు రోజువారీ పెంచుకుంటూ పోతున్నదని నల్లధనం తీసుకువస్తామని నమ్మబలికిన మోడి నల్లధనం తీసుకురావటం దేవుడెరుగు ప్రజలపై ధరల భారాన్ని
మోపుతూ నలుగురు కార్పోరేట్ల చేతుల్లో దేశాన్ని పెట్టి పైశాచిక ఆనందం అనుభవిస్తున్నారని, మూలిగే నక్కపై తాటికాయపడ్డట్టు రాష్ట్ర విద్యుత్ ప్రభుత్వం రూ.5,500 కోట్ల విద్యుత్ ఛార్జీలు ప్రజలపై భారం మోపుతుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొందూ దొందే అన్నట్లుగా వ్యవహరిస్తూ ప్రజల నడ్డివిరుస్తున్నారని విమర్శించారు.

నగర కాంగ్రెస్ అధ్యక్షులు జావీద్ మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యావసర సరుకులతోపాటు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతోపాటు కోడిని చెట్టుకు కట్టి కోళ్ల ధరలను కూడా నియంత్రించలేకపోతున్నారని విమర్శించారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య మాట్లాడుతూ, కుటుంబం ఉన్నవారికి వంటగ్యాస్ నిత్యావసర పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత భారమో తెలుస్తాయాని ఎద్దేవా చేశారు.

జిల్లా నలుమూలల నుండి మహిళాకాంగ్రెస్ కాంగ్రెస్ నాయకురాళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రధానరహదారిపై కట్టెలపొయ్యపై వంటలు చేసి నాయకులు అందరికి వడ్డించారు. ఇవన్నీ చూసి ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరవాలని వారు విమర్శించారు.

also read :- నేడు భట్టి పాదయాత్ర

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు రాయల నాగేశ్వరరావుగారు, జిల్లా బి.సి. సెల్ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, ఖమ్మం రూరల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కళ్లెం వెంకటరెడ్డి, కార్పోరేటర్లు రఫీదాబేగం, పల్లెబోయిన భారతి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు పగడాల మంజుల, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, మలీదు వెంకటేశ్వరరావు, మైనార్టీ రాష్ట్ర నాయకులు బిహెచ్ రబ్బాని, పెండ్ర అంజయ్య, మద్ది వీరారెడ్డి, ఏలూరి రజని, గుడిపుడి జాన్నీ, అనూరాధ, గద్దె నీరజ, కమటాల రేణుక, బాణోత్ అనూష, పదిమల పుష్టలత, సంధ్యారాణి, బాణోత్ సుజాత, నాగవేణి, ఛాయాదేవి, కళాణి. జిలా కిసాన్ సెల్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్కాశేఖర్ గౌడ్, ఏలూరి రవి, బోజెడ సత్యనారాయణ, గజెలి వెంకన, నాగటి చంద్రం, చంద్రగిరి నగేష్, శంకర్‌నాయక్, తుర్లపాటి వెంకటేశ్వరు, తలారి నాగభూషణం, అమరనేని బాబూరావు, బచ్చలకూర నాగరాజు, జర్రిపోతుల అంజని, కొరి సీతారాములు, యడవల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.