Telugu News

తెలంగాణ లో కాంగ్రెస్ దే అధికారం: ప్రియాంక 

అవినీతి అధికారానికి అంతం తప్పదు

0

తెలంగాణ లో కాంగ్రెస్ దే అధికారం: ప్రియాంక 

== అవినీతి అధికారానికి అంతం తప్పదు

== ములుగు సభలో జోస్యం చెప్పిన ప్రియాంక గాంధీ

(ములుగు-విజయం న్యూస్)

ములుగు సభలో ప్రియాంక గాంధీ వాద్రా ప్రసంగం..

►రామప్ప లాంటి అందమైన గుడిని ఎప్పుడూ చూడలేదు
►ఉద్యోగాలు, నిధుల కోసం మీరు కలలు కన్నారు
►మీ కలలు సాకారం అవుతాయని నమ్మి బీఆర్‌ఎస్‌కి ఓటేశారు
►పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని.. భవిష్యత్తు మారుతాయని అనుకున్నారు
►బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది
►తెలంగాణ కలను బీఆర్‌ఎస్‌ నాశనం చేసింది

ఇది కూడా చదవండి:-;ఆరు గ్యారంటీలే కాంగ్రెస్ కు శ్రీరామ రక్ష:- భట్టి
►తెలంగాణ ఏర్పడినా సామాజిక న్యాయం జరగలేదు
►మీ కలను కాంగ్రెస్‌ అర్థం చేసుకుంది
►సామాజిక న్యాయం జరగాలన్నదే కాంగ్రెస్‌ సిద్ధాంతం
►కాంగ్రెస్‌ హయాంలోనే ఐఐటీ, ఐఐఎంలు వచ్చాయి
►తెలంగాణ కోసం కాంగ్రెస్‌ రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేసింది
►తెలంగాణ ఇస్తే రాజకీయ మూల్యం చెల్లించాల్సి వస్తుందని సోనియాగాంధీకి తెలుసు
►అయినా సోనియా గాంధీ మీ కోసం నిర్ణయం తీసుకున్నారు
►దూరదృష్టితో తెలంగాణ ఏర్పాటునకు కృషి చేశారు
►రాజకీయ లబ్ధి కోసం కాకుండా.. ప్రజల కోసం నిర్ణయం తీసుకున్నారు

దూరదృష్టితో తెలంగాణ ఏర్పాటునకు కృషి చేశారు
►రాజకీయ లబ్ధి కోసం కాకుండా.. ప్రజల కోసం నిర్ణయం తీసుకున్నారు

ఇది కూడా చదవండి:-:బతుకమ్మ మన పూల పండగ: మంత్రి పువ్వాడ
►మీ అందరి ఆకాంక్షలు నెరవేర్చేందుకే నిర్ణయం తీసుకున్నారు
►తెలంగాణలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు
► లక్ష ఉద్యోగాల్ని కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భర్తీ చేయలేకపోయింది
►నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే.. వారి వ్యక్తిత్వాన్ని అగౌరవ పరుస్తున్నారు
►కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం
►తెలంగాణలో రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది
►వరి రూ. 2,500, మొక్కజొన్నకు రూ.2,200 మద్దతు ధర ఇస్తాం
►రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం
► ఇందిరమ్మ రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తాం
►బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో వారి కుటుంబానికే ప్రాధాన్యత దక్కిందిఇ

ది కూడా చదవండి:- ఖమ్మంలో దూకుడు పెంచిన కాంగ్రెస్

అమరులను కాంగ్రెస్‌ గౌరవిస్తుంది.. శ్రీకాంత్‌ చారికి నా నివాళి

►బీఆర్‌ఎస్‌ కేబినెట్‌లో ముగ్గురే బీసీ మంత్రులు ఉన్నారు
►గల్ఫ్‌ బాధితుల్ని ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపడతాం
►ఆదివాసీల హక్కుల్ని బీఆర్‌ఎస్‌ పెద్దలు లాక్కుంటున్నారు
►మీ భూముల నుంచి మిమ్మల్ని వెళ్లగొడుతున్నారు
►మీకు రావాల్సిన డెవలప్‌మెంట్‌ ఫండ్‌ను మళ్లిస్తున్నారు
►ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గిరిజనులకు ఇళ్లు
►గత కాంగ్రెస్‌ ప్రభుత్వం మీకు పోడు భూముల పట్టాలు ఇచ్చింది
►18 ఏళ్లు దాటిన యువతులకు ఎలక్ట్రిక్‌ స్కూటీలు ఇస్తాం
►ఈ ప్రభుత్వం ఉద్యోగ నియామకాల భర్తీపై దృష్టి పెట్టలేదు
►రకరకాల మాఫియాలను ప్రొత్సహించింది
►మీ కోసం ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్‌ తెచ్చింది
►గ్యారెంటీలు ఇస్తామన్న రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక పనులు మొదలుపెట్టాం