అధికారం పక్కాగా కాంగ్రెస్ దే : మువ్వా
== సూపర్ ఫైవ్ హామీతో వస్తున్నాం
== జిల్లా కాంగ్రెస్ నాయకులు మువ్వా విజయ్ బాబు
== రఘునాథపాలెం మండలంలో గడప గడపకు కాంగ్రెస్
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్):
పేద ప్రజల రాజ్యం రావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు అన్నారు. శుక్రవారం రాత్రి రఘునాథపాలెం మండలంలోని పలు గ్రామాల్లో గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మువ్వా విజయ్ బాబు మాట్లాడుతూ రూ.500 కే వంటగ్యాస్… నిరుద్యోగ యువతకు రెండు లక్షల ఉద్యోగాలు.. ఇందిరమ్మ ఇంటికి రూ.5లక్షలు…రైతులకు రూ.2లక్షల రుణమాఫీ… అర్హులైన ప్రతిఒక్కరికీ రూ. 4వేల పెన్షన్ ఇలా ఐదు డిక్లరేషన్ అమలు హామీ తో తెలంగాణలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తలపడబోతున్న తమదే అధికారమని పేర్కొన్నారు. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమం రఘునాథపాలెం మండలంలోని కె.వి. బంజార, మూలగూడెం, మంగ్యా తండా గ్రామాల్లో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా మువ్వా మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో సిద్ధంగా ఉందని తెలిపారు. అధికారంలోకి రావడమే తరువాయి పై డిక్లరేషన్లతో పాటు ఇంకా అనేక రకాలైన సంక్షేమ పథకాలను తమ పార్టీ అమల్లోకి తీసుకువస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ మల్లీడు జగన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరైయ్యారు.
ఇది కూడా చదవండి: ప్రజల సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం: జావిద్