Telugu News

కాంగ్రెస్ తుంగ పూస లాంటిది: పువ్వాళ్ల

మంత్రి కేటీఆర్ పై పువ్వాళ దుర్గాప్రసాద్ ఫైర్

0

కాంగ్రెస్ తుంగ పూస లాంటిది: పువ్వాళ్ల

== ఎంత తొక్కితే అంత లేస్తం

== కాంగ్రెస్ లేకపోతే నీకు బతుకే లేదు

== విమర్శించే ముందు నీ స్థాయి ఏంటో తెలుసుకో

== చెప్పుకోడానికి చేసిందేమీ లేక కాంగ్రెస్ పై విమర్శల

== రాజకీయాల్లో డబ్బులు ఎర చుపిందే బీఆర్ఎస్

== గాలి మోటార్ లో వచ్చి గాలి మాటలు కాదు

== దమ్ముంటే అభివృద్ధిపై చర్చ పెట్టు

== మంత్రి కేటీఆర్ పై పువ్వాళ దుర్గాప్రసాద్ ఫైర్

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

కాంగ్రెస్ పార్టీ ఓ తుంగ పూస లాంటిదని ఎంత గట్టిగా తొక్కితే అంత పైకి లేస్తామని  జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ మంత్రి కెటిఆర్ పై ఫైర్ అయ్యారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసి ఉండకపోతే నీకు నీ కుటుంబానికి బతుకే లేదని కాంగ్రెస్ ను విమర్శించే ముందు నీ స్థాయి ఏంటో ఆలోచించుకోవాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా కెటిఆర్ కాంగ్రెస్ పై  చేసిన విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. జిల్లా పర్యటనలో బాగంగా పది ఏండ్లుగా జిల్లాకు ఏం చేశారో చెప్పకుండా కెటిఆర్ కాంగ్రెస్ పై విషం చిమ్మే ప్రయత్నం చేశారని, దీన్ని బట్టి చూస్తుంటే చెప్పుకోడానికి ఖమ్మం లో ఆయన చేసింది శూన్యమని స్పష్టం అవుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ లతో తండ్రీ కొడుకులకు భయం పట్టుకుందని అందుకే సుడిగాలి పర్యటనలు చేస్తూ కాంగ్రెస్ పై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఇది కూడా చదవండి: నిర్భందాలతో ఎంతమందిని ఆపగలరు: పువ్వాళ్ల

కాంగ్రెస్ కు ఎన్నో ఏండ్ల నాటి చరిత్ర ఉందని ఖమ్మంలో నెలకొన్న పరిశ్రమలు కాంగ్రెస్ ప్రభుత్వం నాటి హయాంలో ఏర్పాటు చేసినవే అని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వాటి అమలు తీరుపై రిప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న మమ్మల్నీ పోలీస్ లతో అడ్డుకున్నారని మండిపడ్డారు.పది ఏoడ్లలో  బీఆర్ఎస్ సాధించిన ప్రగతి లిక్కర్, లీకుల స్కాం లే అని ఎద్దేవ చేశారు.ప్రాజెక్ట్ ల పేరుతో కొన్ని లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని కాగ్ నివేదికలే చెపుతున్నాయని గుర్తు చేశారు.ఖమ్మంలో  కార్పొరేషన్ ని బ్యాంక్ కు తాకట్టు పెట్టి వంద కోట్ల రూపాయల అప్పు తీసుకున్న నీచమైన పాలన ఎప్పుడు ఎక్కడ జరగలేదని మండిపడ్డారు. ఇచ్చిన మాట తప్పని ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే అని ముఖ్య మంత్రి ఎవరైనా, ప్రధాన మంత్రి ఎవరైనా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీ లు ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పై అవాకులు చెవాకులు మానేసి ప్రజా సమస్యల పై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ మాట్లాడుతూ…కెటిఆర్ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ నాయకుల అరెస్ట్ ను చూస్తుంటే పువ్వాడ అజయ్ కు మంత్రి కెటిఆర్ ఎంత భయపడుతున్నారో దీన్ని బట్టి అర్థం అవుతోందని అన్నారు. బిసి రుణాలు,మైనార్టీ రుణాలు, దళిత బంధు ల పేరుతో ప్రజలను మభ్య పెడుతూ మళ్ళీ ఓట్లు అడిగి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. అరవై యేండ్ల లో కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారని అరవై యేండ్ల లో కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ ఇచ్చిందని మీరు ఇప్పుడు అనుభవిస్తున్న భోగ భాగ్యాలను కాంగ్రెస్ వేసిన భిక్ష కాదని అని ఎద్దేవా చేశారు.

ఇది కూడా చదవండి: ఓట్ల కోసం కేసీఆర్ ది దొంగ కపట నాటకం: భట్టి విక్రమార్క

ఎన్నికలు సమీపిస్తున్న వేళ హంగు ఆర్భాటాలతో హడావడిగా వచ్చి అభివృద్ధి చేస్తాం అని శంకుస్థాపనలు చేస్తే నమ్మడానికి ఖమ్మం ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు ఏం కాదని గుర్తు చేశారు. మీరు ఏంటో మీ ప్రభుత్వం ఏంటో ఇక్కడి ప్రజలకు తెలుసు అని మీ దోపిడీ, కమిషన్ల కాంట్రాక్టలతో విసుగు చెందారని అన్నారు. నిధులు నీల్లు నియామకాలు అంటూ కల్లబొల్లి మాటలతో అధికారం దక్కించుకుని ఒక్క ఉధ్యోగ నియామక ప్రక్రియ ను పూర్తి చేయలేని  అసమర్థ నాయకత్వం రాష్ట్రంలో ఉందని అన్నారు. కాంగ్రెస్  ప్రభుత్వం రాబోతుందని అక్రమలతో సంపాదించిన సొమ్మును అంతా ప్రజలకు పంచి పెట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మిక్కిలి నేనీ మంజుల, పి సి సి సభ్యులు జిల్లా ఓ బి సి సెల్ అద్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, జిల్లా SC సెల్ అద్యక్షులు బొడ్డు బొందయ్య, కార్పొరేటర్లు లకావత్ సైదులు నాయక్, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, దొడ్డా నగేష్, మహ్మద్ రఫేదా బేగం, పల్లెబోయిన భారతి చంద్రం, మాజి కౌన్సిలర్ పాలకుర్తి నాగేశ్వరావు, నగర కాంగ్రెస్ నాయకులు ముస్తాఫా తదితర నాయకులు పాల్గొన్నారు.

ఇది కూడ చదవండి: ప్రతి పక్షాల గొంతు నొక్కుతున్నారు: జావిద్