ప్లీనరి నిర్ణయాలతో కాంగ్రెస్ బలోపేతం: జావిద్
== క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ వైపు యువత
== మహిళలు సైతం అదే బాటలో…
== సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహమ్మద్ జావేద్
ఖమ్మం/రాయపూర్, ఫిబ్రవరి 25(విజయంన్యూస్):
మహిళలకు యువతకు పెద్ద పీట వేయాలని రాయపూర్ లో జరిగిన ప్లీనరిలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంతో అత్యంత సంతోషాన్ని కలిగించిందని ఖమ్మం సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహమ్మద్ జావేద్ అన్నారు. ప్లీనరీలో రాజనీతి, ఆర్థిక, మహిళల, యువతకు పార్టీ పదవుల్లో 50 శాతం ప్రాధాన్యతపై నిర్ణయం తీసుకోవడం అత్యంత ముదావహమని ఆయన చెప్పారు. ఈ నిర్ణయం వల్ల కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. యువత, మహిళలు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తారనే నమ్మకాన్ని వెలిబుచ్చారు. కాగా, ఇదే సమయంలో .. అత్యంత క్లిష్టపరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టి రెండుసార్లు పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకువచ్చిన సోనియమ్మ రాజకీయాలనుంచి వైదొలగుతానని చేసిన ప్రకటన అత్యంత బాధాకరమని మహమ్మద్ జావేద్ చెప్పారు.
ఇదికూడా చదవండి: స్వంత గూటికా..?సోదరి గూటికా..? పొంగులేటి దారేటు..?
రాయ్ పూర్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్లీనరిలో పాల్గొన్న వివిధ రాష్ట్రాల ప్రతినిధులతో కలిసి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువాల దుర్గాప్రసాద్, ఖమ్మం నగర అధ్యక్షులు టీపీసీసీ సభ్యులు మహమ్మద్ జావిద్ పాలేరు నియోజకవర్గం టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరావు, పుచ్చకాయల వీరభద్రం, వడ్డే నారాయణరావు, రాందాస్ నాయక్, సున్నం నాగమణి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కర్ గౌడ్, ఇంకా ఖమ్మం ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ లకావత్ సైదులు, ఖమ్మం నియోజకవర్గం సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఏలూరి రవి తదితరులు పాల్గొన్నారు