Telugu News

కాంగ్రెస్‌కు అధికారం ఖాయం: సోనియా

తెలంగాణలో బీఆర్ఎస్ పతనం తప్పదు

0

కాంగ్రెస్‌కు అధికారం ఖాయం: సోనియా

== తెలంగాణలో బీఆర్ఎస్ పతనం తప్పదు

== ఆరు హావిూ పథకాలు ప్రకటించిన సోనియా

== పేద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం

= రూ. 500లకే సిలిండర్‌ సరఫరా

== టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ

== గృహలక్ష్మి కింద 200 యూనిట్ల కరెంట్‌ ఉచితం

== ఎస్సీ, ఎస్టీలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం

== ఏకకాలంలో రెండు లక్షల వరకూ రైతు రుణాలను మాఫీ

హైదరాబాద్, ఖమ్మంప్రతినిధి, సెప్టెంబర్‌17(విజయంన్యూస్):

దేశం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఏఐసీసీ  అగ్రనేత, మాజీ చైర్మన్ సోనియాగాంధీ జోస్యం చెప్పారు.తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు మేలు జరిగేలా చేయాలంటే కచ్చితంగా తెలంగాణ ప్రజలందరు కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకరావాలని, అదే తన స్వప్నం అని ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడలో నిర్వహించిన తెలంగాణ విజయభేరి సభలో సోనియా గాంధీ పాల్గొని ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చేలా ప్రజలందరూ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా ఉండాలని పిలుపు ఇచ్చారు. తెలంగాణను తామే ఇచ్చామని, ఇకపై రాష్టాన్న్రి  ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తామని సోనియా మాట్లాడారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ కొన్ని గ్యాంరటీలను ప్రకటించారు.

ఇది కూడా చదవండి: విజయభేరి సభలో జోస్యం చెప్పిన రాహుల్

ఈ గ్యారంటీ స్కీంలు ప్రకటించడం పట్ల తాను ఎంతో సంతోషంగా ఉన్నానని అన్నారు. మరికొందరు నేతలు మరిన్ని గ్యారంటీ స్కీమ్‌లను ప్రకటించారు. మహాలక్ష్మీ పథకం కింద పేద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం ఇస్తామని సోనియా గాంధీ ప్రకటించారు. ఇంటి అవసరాల కోసం రూ.500 కే వంట గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో మహిళలు అందరికీ ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని అన్నారు. రాజీవ్‌ యువ వికాసంలో భాగంగా కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తామని ప్రకటించారు. అంబేద్కర్‌ అభయ హస్తం పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. ఏకకాలంలో రెండు లక్షల వరకూ రైతు రుణాలను మాఫీ చేస్తామని హావిూ ఇచ్చారు. ఇల్లు లేనివారికి ఇంటి స్థలంలో నిర్మాణానికి రూ.5 లక్షల సాయం,ఉద్యమకారుల కుటుంబాలకు 250 చదరపు గజాల స్థలం కేటాయింపు చేస్తామన్నారు. రైతుభరోసా పథకం కింద రైతులు, కౌలు రైతులకు ఏటా రూ.15 వేల పంట పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. వ్యవసాయ కూలీలకు ఏడాదికి  రూ.12 వేల ఆర్థిక సాయం. వరి పంటకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇచ్చేలా ప్రణాళిక చేస్తామని అన్నారు. గృహజ్యోతి పథకం కింద ప్రతి ఫ్యామిలీలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు వినియోగించుకొనే వెసులుబాటు విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఏర్పాటు చేస్తామని అన్నారు.

ఇది కూడా చదవండి: నరేంద్రమోడీని ప్రశ్నిస్తే కేసులే: రాహుల్

చేయూత పథకం కింద నెలకు వయసు పైబడిన వారికి రూ. 4 వేల చొప్పున పింఛను అందే ఏర్పాటు,రూ.10 లక్షల వరకు రాజీవ్‌ ఆరోగ్యశ్రీ బీమా వచ్చేలా ప్రణాళిక ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్‌ నిర్వహించిన విజయభేరి సభలో ఆ పార్టీ ఆరు గ్యారెంటీ హావిూలను ప్రకటించింది. కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ హావిూలను ప్రకటించారు. తెలంగాణలో రానున్న ఎన్నికల్లో అధికారమే టార్గెట్‌ గా దూసుకెళ్తున్న కాంగ్రెస్‌ మహిళా ఓటర్లే మెయిన్‌ టార్గెట్‌ గా మెజారిటీ హావిూలు ప్రకటించినట్లు తెలుస్తోంది.