Telugu News

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.500కే గ్యాస్

8న ఖమ్మంలో పాదయాత్ర

0

అధికారంలోకి రాగానే రూ.500కే గ్యాస్

?? పెరిగిన అన్ని నిత్యావసర ధరలపై ఉక్కుపాదం

?? భారీ ప్రణాళికతో కాంగ్రెస్ అధిష్టానం సిద్ధం

?? జోడో భారత్ కు మద్దతుగా 8న ఖమ్మం నియోజకవర్గం లో పాదయాత్ర

?? విలేకర్ల సమావేశంలో  నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ వెల్లడి

(పెండ్ర అంజయ్య)

ఖమ్మంప్రతినిధి, సెప్టెంబర్ 6(విజయంన్యూస్)

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అన్ని నిత్యావసర ధరలపై ఉక్కుపాదం మోపి రూ.500కే గ్యాస్ ను అందజేయడానికి కాంగ్రెస్ అధిష్టానం సిద్ధంగా ఉందని నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ అన్నారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ సంజీవరెడ్డి భవన్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ జావేద్ పాల్గొని మాట్లాడుతూ… ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు

, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ ఈ నెల 7 నుంచి కన్యాకుమారి నుంచి కాశి వరకు జోడోభారత్ పేరిట పాదయాత్ర చేపట్టనున్న విషయం అందరికీ తెలిసింది.

ఇది కూడా చదవండి : టాస్ గెలిచిన శ్రీలంక.. బొలింగ్ పస్ట్

టిపిసిసి ఆదేశానుసారం, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సూచన మేరకు జోడో భారత్ కు మద్దతుగా ఈనెల 8న ఖమ్మం నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించనన్ననట్టు తెలిపారు. రాహుల్ గాంధీ చేపట్టబోయే పాదయాత్రతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టనున్నారని తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం లో అన్ని నిత్యవసర ధరలు ప్రజలకు అందుబాటులో ఉండేవని నేటి పాలకులు వాటిని ప్రజలకు అందని ద్రాక్షాలానే మారుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎనిమిదేండ్ల కాలంలో కేసీఆర్ తన ఆస్తులను పెంచుకోవడానికి మోడీ తన దోస్తులకు దోచిపెట్టడానికి పనిచేశారని అన్నారు. కార్పొరేట్ సంస్థల ఆస్తులు గతంలో కంటే బీజేపీ ప్రభుత్వ హయాంలో భారీగా పెరిగాయని అన్నారు. ఇద్దరూ కలిసి ప్రజలకు గుదిబండలా మారారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి పాలన ముగుస్తున్నప్పటికీ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదని అన్నారు. బిజెపి అధికారంలోకి వస్తే ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్నారని ఇంతవరకు ఎన్ని నోటిఫికేషన్లు విడుదల చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చేది పోయి రెండు కోట్ల ఉద్యోగాలు తీసేసే పని చేస్తున్నారని ప్రభుత్వ ఆస్తులన్నీ కార్పొరేట్ కంపెనీలకి అప్పనంగా దోచిపెడుతూ రాబోయే తరాలకు ఉద్యోగ కల్పన లేకుండా చేస్తున్నారని అన్నారు దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి అంటూ గద్దెనెక్కిన కేసీఆర్ తన కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు కల్పించుకున్నారని అన్నారు. బిజెపి అధికారం చేజిక్కించుకోవాడనికి మతాల పేరుతో కులాల పేరుతో విధ్వంసం సృష్టిస్తుందని మండిపడ్డారు. ఎవరెన్ని పన్నాగాలు పన్నిన రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని దీమా వ్యక్తం చేశారు. అనంతరం నగర కార్పొరేటర్ దుద్దుకూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..

ఇది కూడా చదవండి : చండ్రుగొండలో ‘హరితహారం’ ఆగం.. మాగం..

8న పాదయాత్ర రఘునాధపాలెం మండలం మూలగూడెం నుంచి ప్రారంభమవుతుందని  తెలిపారు. అనంతరం మండల ముఖ్య నాయకులు కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. అత్యధిక మంది కార్యకర్తలతో నాయకులతో కలిసి పాదయాత్రను విజయవంతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సైదులు నాయక్, పల్లెబోయిన భారతి చంద్రం, ముస్తఫా, జిల్లా మహిళా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు దామస్వరూప, కిలారు అనిల్, ఏలూరి రవి, బండి మాధవరావు, గడ్డి కొప్పుల ఆనందరావు, రఘునాధపాలెం మండల బాధ్యులు బాలాజీ గారు దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు, ఓబిసి నగర్ అధ్యక్షులుబాణాల లక్ష్మణ్, రెంటాల ప్రసాద్, ఇర్జాల కృష్ణ, కొంటెముకల నాగేశ్వరరావు, బాతుల సుధాకర్, మామిడాల పుల్లయ్య ,నుకారపు వెంకటేష్, బిహెచ్ రబ్బాని అబ్బాస్, జానీ పాష, వెంకట్ నర్సయ్య, బానోత్ రమేష్, మురళి, ఉపేందర్, హరి సింగ్, సురేందర్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.