కాంగ్రెస్ ఖేల్ ఖతం దుకాణ్ బంద్: మంత్రి హరీష్
== రాబోయే ఎన్నికలు ‘నోబెల్స్..గ్లోబెల్స్’ మధ్య పోటీ
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖేల్ ఖతం దుకాణ్ బంద్ అని రాష్ట్ర అర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు విమ్మర్శించారు. ఖమ్మంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన మంత్రి, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల సంక్షేమాభివృద్ది కోసం పనిచేస్తుంటే కావాలనే ప్రతిపక్షాలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, ఇష్టానుసారంగా గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీష్ రావు విమ్మర్శించారు. అందుకే రాబోయే ఎన్నికల్లో నోబెల్స్, గోబెల్స్ కి మధ్య పోటీ జరుగుతుందన్నారు. గోబెల్స్ ప్రచారం చేసే కాంగ్రెస్ నీ ప్రజలు కోరుకోరని, బిఆర్ఎస్ మరోసారి గెలుస్తుందని, హ్యట్రిక్ సీఎంగా కేసీఆర్ చరిత్ర తిరగరాయబోతున్నారని జోస్యం చెప్పారు. కౌరవుల లాగా వంద అబద్ధాలు ఆడినా మీ పక్క జన బలం లేదని, బీఆర్ఎస్ వైపు, సీఎం కేసీఆర్ వైపు జనబలం ఉందన్నారు.
allso read- అభివృద్ధి లో తెలంగాణ నెం 1: మంత్రి హరీష్
50 ఏళ్లలో కాంగ్రెస్ ఎందుకు ప్రాజెక్టులు కట్టలేదని, ఎందుకు ఎన్నేళ్లపాటు నీళ్ళు ఇవ్వలేదు, కరెంట్ ఇవ్వలేదు. మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయలేదన్నారు. రైతుబంధు, రైతు రుణమాఫీ, రైతు బీమా, ఇంటింటికి నల్లా నీళ్లు ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. మీకు పాలించడం చేతకాదని, పదవుల కోసం తన్నులాడుకోవడం, అడ్డగోలుగా అమ్ముకోవడం మాత్రమే తెలుసన్నారు. రైతులకు, ప్రజలకు ఆకలి అయినప్పడు కాంగ్రెస్ నేతలు అన్నం పెట్టలేదు, కానీ నేడు గోరుముద్దలు తినిపిస్తం అంటే ప్రజలు నమ్ముతారా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు చిత్తశుద్ది ఉంటే తెలంగాణలో పథకాలు ఉన్నట్లుగా ఛత్తీస్ గడ్, కర్ణాటక, రాజస్థాన్ లో అమలు చేయోచ్చు కదా అని ప్రశ్నించారు. అక్కడ చేయలేనోళ్లు..ఇక్కడ చేస్తారంటా.?అంటూ విమ్మర్శించారు. గతంలో రైతులు ఎరువుల కోసం, విత్తనాల కోసం తన్నులు తినేవారని, నీటి కోసం పోట్లాట పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హాయంలో తన్నుల సంస్కృతి ఉంటే, బీఆర్ఎస్ హాయంలో టన్నుల సంస్కృతి ఉందన్నారు. సీట్ల కోసం, పదవుల కోసం ఏమి జరగక ముందే కాంగ్రెస్ కొట్లదితున్నదని, మత కలహాలు సృష్టించి ఎంతకైనా దిగజార్చే పరిస్థితి కాంగ్రెస్ దని అన్నారు.కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీ ఉండే, ఇప్పుడు వయా బెంగళూరు అయ్యిందన్నారు. మాకు హైకమాండ్ ప్రజలని అన్నారు.
allso read- పనోల్లు కావాలా, పగోల్లు కావాలా: హరీష్ రావు