పతితో సతి అడుగులో అడుగు
== కిలోమీటర్ల కొద్ది నడుస్తూ నేతను ప్రోత్సహిస్తున్న సతిమణి
ఖమ్మంప్రతినిధి, ఆగస్టు 10(విజయంన్యూస్)
రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన నాయకుల భార్యలు ఎక్కువగా ఇంటికే పరిమితమవుతారు..? కొంత మంది ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులైనప్పటికి చాలా తక్కువగా భర్తతో కలిసి తిరుగుతుంటారు.. భార్యలు ప్రజాప్రతినిధులైతే భర్తలు వారితో కలిసి తిరిగడం మనం చూశాం. కానీ భర్తలు ప్రజాప్రతినిదులు అయితే కలిసి పర్యటన చేసిన దాఖలాలు చాలా తక్కువ. ఇక ముఖ్యంగా రాజకీయ కుటుంబంలో అయితే అసలే మహిళలు బయటకు కనిపించరు. కానీ ఆమె మాత్రం తన పతి చేయిపట్టుకుని అడుగులో అడుగేస్తు ముందుకు నడుస్తున్నారు. ఆయన వెనువెంటనే ఉంటూ అతన్న రాజకీయంగా ప్రోత్సహిస్తున్నారు. రాజకీయ కుటుంబంలో నుంచి వచ్చి రాష్ట్రంలోనే కీలక నేతకు భార్యగా ఉన్న ఆమె ఏనాడు తన ఇంటికి పరిమితం కాలేదు. భర్త రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటున్నప్పటికి ఆమె స్వంత నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ వివిధ రకాల పనులను తన భర్తతో చెప్పించి పరిష్కరిస్తున్నారు. అంతే కాకుండా వివాహ, శుభకార్యాలల్లో పాల్గొని ప్రధాన నేత అందుబాటులో లేని లోటును ఆమె పూర్తి చేస్తున్నారు. ఇక ఎప్పుడు పాదయాత్రలను పెట్టిన ఆయన వెంటే ఉంటూ నడిపిస్తున్నారు. ఆయనతో సమానంగా పాదయాత్ర చేస్తున్నారు. వందల కిలోమీటర్లు ఆమె భర్తతో కలిసి పాదయాత్ర చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఆమె రాజకీయాల్లో వేలు పెట్టకుండా తన భర్తతో కలిసి నడుస్తున్నారు. పార్టీ పదవులకు దూరంగా ఉంటున్నారు. ప్రజాప్రతినిధి కావాలని మనసులో ఉన్నప్పటికి రాజకీయ ఓనమాలు నేర్చుకునే పనిలో ఉన్నారు. కుటుంబ పాలనకు దూరంగా ఉంటున్నారు. ఇంతకు ఆమె ఎవరని అనుకుంటున్నారా..? అయితే ఈ కింది లింక్ ను క్లిక్ చేసి వార్తను చదవండి..?