Telugu News

ఖమ్మం ఆర్డీవో కార్యాలయం పోలింగ్ కేంద్రం ఎదుట కాంగ్రెస్ నేతల ఆందోళన.

పోలింగ్ కేంద్రంలో దగ్గరుండి ఓట్లు వేస్తున్నారని కాంగ్రెస్ నేతల ఆందోళన..

0

ఖమ్మం ఆర్డీవో కార్యాలయం పోలింగ్ కేంద్రం ఎదుట కాంగ్రెస్ నేతల ఆందోళన..

పోలింగ్ కేంద్రంలో దగ్గరుండి ఓట్లు వేస్తున్నారని కాంగ్రెస్ నేతల ఆందోళన..

అంతకముందు ఖమ్మం కార్పోరేషన్ కమీషనర్ కు పిర్యాదు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి..

ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు..

కొద్ది సేపు ఖమ్మంలో ఉదృక్తత.. ప్రశాంత వాతావరణంలోకి తీసుకొచ్చిన పోలీసులు..

(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)

ఉమ్మడి ఖమ్మం స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వల్ప ఉదృకత్త నెలకొంది.
ఖమ్మం రెవిన్యూ డివిజనల్ ఎమ్మెల్సీ ఎన్నికల కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. టిఆర్ఎస్ కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకుని కూడా పోలింగ్ కేంద్రంలోనే ఉంటున్నారని ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి రాయల నాగేశ్వరరావు ఫిర్యాదు చేశారు. అయినప్పటికి అధికారులు పట్టనట్టు ఉంటున్నారని కాంగ్రెస్ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు పోలింగ్ కేంద్రంలోకి చొచ్చుకొని పోవడానికి ప్రయత్నించగా పోలీసులకి కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.

పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను నెట్టుకుంటూ కాంగ్రెస్ కార్యాలయం వరకు తీసుకువెళ్లగా ఆయన కానీ వారు పోలింగ్ కేంద్రం లోకి వచ్చేందుకు ప్రయత్నించగా ఒక అరగంట పాటు ఒకరికొకరు నెట్టు కొన్నారు. పోలీసులు కాంగ్రెస్ నాయకులను తమ పార్టీ ఆఫీస్ లోకి నెట్టివేసేందుకు ప్రయత్నించారు. . కాంగ్రెస్ అభ్యర్థి పిర్యాదు చేసినప్పటికి పోలీసులు కూడా టిఆర్ఎస్ వారికి మద్దతుగా నిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాదనలకు దిగారు. పరిస్థితి మరి ఉద్రిక్తంగా మారటంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.

ALSO READ :-గాడితప్పిన “సహాకార”0