బుడగ జంగాల వారిని కలిసిన కాంగ్రెస్ నాయకులు
జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్, జావేద్
బుడగ జంగాల వారిని కలిసిన కాంగ్రెస్ నాయకులు
== జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్, జావేద్
(ఖమ్మంనగరం-విజయంన్యూస్)
నగరంలో 22వ డివిజన్ లో గల బుడగ జంగాల వారిని నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ తో కలిసి సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ..జూలై 2వ తేదీ ఖమ్మం జిల్లాలో నిర్వహించనున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సభ ను విజయవంతం చేయాలని కోరారు.పీపుల్స్ మార్చ్ పాదయాత్ర తో సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారని అన్నారు. ఖమ్మం లో నిర్వహించనున్న బహిరంగ సభలో వారి సమస్యల పరిష్కారానికి ముందుకు పోవాల్సిన అంశాల గురించి వివరించనున్నారని తెలిపారు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ గూటిలో చేరిన శీనన్న
ప్రతి ఒక్కరూ సభను విజయవంతం చేయాలని కోరుతున్నట్టు తెలిపారు. అనంతరం నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లా భోద్ నియోజక వర్గంలో పిప్పిరి మండలంలో ప్రారంభమైన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర వచ్చే నెలలో ఖమ్మం లో ముగుస్తుందని తెలిపారు. అందులో భాగంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధినాయకులు రాహుల్ గాంధీ పాల్గొనున్నారని, ఈ సభకు భారీ సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. బుడగ జంగాల నాయకులు కార్యకర్తలు అభిమానులు అత్యధిక మంది పాల్గొని సభను విజయవంతం చేయడానికి కృషి చేయాలని కోరారు. అనంతరం వారిని బుడగ జంగాల నేతలు శాలువాలతో సత్కరించారు.
== గురూజీ సగతేవరాజు ను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు
22 వ డివిజన్ గురూజీ సగతేవరాజుని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్, ఖమ్మం నగర అధ్యక్షుడు మహమ్మద్ జావిద్ మర్యదపూర్వకంగా కలిశారు. అనంతరం వారు వీరికి శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో 2 వ డివిజన్ కార్పొరేటర్ మలిదు వెంకటేశ్వర్లు, రాష్ట్ర మైనారిటీ సెల్ కన్వీనర్ రబ్బానీ,జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు మూజహిద్ హుస్సేన్, నగర సేవాదల్ అధ్యక్షులు సయ్యద్ గౌస్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపా అధ్యక్షులు కొంటె ముక్కుల నాగేశ్వరరావు, గంగ రాజు,రఘునాథ పాలెం మండల అధ్యక్షుడు భూక్యా బాలాజీ, మారం కరుణాకర్ రెడ్డి, సత్యం బాబు, మూజాహిద్, అనాసి రాధ కృష్ణ, శివ, సాంబయ్య, ఏవి రాజు, దశరవహం తది తరులు పాల్గొన్నారు.