Telugu News

కాంగ్రెస్ సభ్యత్వం ప్రజలందరికి భరోసానిస్తుంది

అంజయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి

0

కాంగ్రెస్ సభ్యత్వం ప్రజలందరికి భరోసానిస్తుంది
కార్యకర్తలందరు కష్టపడి సభ్యత్వ నమోదు చేయాలి సభ్యత్వనమోదు కార్యక్రమ ఎర్రుపాలెం మండల ఇన్ చార్జ్ పెండ్ర అంజయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి
(ఎర్రుపాలెం-విజయంన్యూస్)
కాంగ్రెస్ సభ్యత్వం కుటుంబానికి భరోసానిస్తుందని, అందుకే ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోవాలని సభ్యత్వ నమోదు కార్యక్రమ ఎర్రుపాలెం నియోజకవర్గ ఇన్ చార్జ్ పెండ్ర అంజయ్య, మండల పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి కోరారు. శనివారం మండల పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎర్రుపాలెం మండలంలోని మీనవోలు, తక్కెలపాడు, ములుగుమూడు,ఇనగాలి గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుండగా, ఇంచార్జ్ పెండ్ర అంజయ్య పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం అనేక సంక్షేమాభివద్ధి పథకాలను ప్రవేశపెట్టిందని, ఆ పథకాలు ప్రజలను ఎంతగానో సంతోషపెట్టాయని, ప్రజలందరికి ఆ పథకాలు అందే విధంగా ఆ నాటి కాంగ్రెస్ ప్ఱభుత్వాలు చర్యలు తీసుకున్నాయని తెలిపారు. కానీ నేటి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తారులో అన్నంపెట్టి కుక్కలను ఎగేసినట్లుగా నియోజకవర్గానికి కొంత మందికి పథకాన్ని అమలు చేస్తామని చెప్పి ప్రజలందరు ఆశ పెట్టి పథకాన్ని నీరుగారుస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో ఒకే సారి రుణమాఫీ ప్రకటించి రైతులకు మేలు చేస్తే, నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీ అని చెప్పి మాటలతో కాలాన్ని వెల్లదిస్తున్నాయని ఆరోపించారు. ఎరువులు, విత్తనాల ధరలను అమాతంగా పెంచేసి, రైతు బంధు అంటూ రైతుల సొమ్ముతో రైతులకు రైతుబంధు ఇస్తున్నారని, అది కాస్త మా ప్రభుత్వ క్రిడెట్ అని చెప్పుకుంటున్నారని ఆరోపించారు.  రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలను కల్పించకుండా రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయకుండా నువ్వంటే నువ్వేనంటూ ఒకరినోకరు పంచాయతీలు పెట్టుకుంటూ రైతుల నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు.

also read :-హైదారాబాద్ గల్లీలో కాదు.. దమ్ముంటే ఢిల్లీలో మిలియన్ మార్చ్ పెట్టు బండి సంజయ్- మంత్రి హరీష్..

నిత్యావసర వస్తువులు, పెట్రోల్,డిజీల్ ధరలు, భూముల రిజిస్ట్రేషన్ ధరలు, ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు ఒక్కటేంటి చెప్పకుంటూ పోతే మానవ జీవనంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు ధరలన్నింటిని పెంచుకుంటూ వస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజలకు ఏదో చేసినట్లు గొప్పలు చెబుతున్నాయని ఆరోపించారు. కానీ ఎక్కడ కూడా ప్రజలకు చేసిందేమి లేదని, పెంచిన ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమ్మర్శించారు. ప్రజలందరు అర్థం చేసుకోవాలని, ఏ ప్రభుత్వం, ఏ పార్టీ ప్రజలకు మేలు చేస్తుందో గమనించాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. అందుకే ప్రజలను కాపాడే, ప్రజల గౌరవాన్ని నిలిపే పార్టీని ప్రజలందరు ఆశీర్వదించాలని, ఆమోదించాలని, ప్రతి ఒక్కరు కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎన్ టీయుసీ మండల అధ్యక్షుడు శీలం నర్సిరెడ్డి, ఎర్రుపాలెం సోసైటీ ఉపాధ్యక్షుడు కడియం శ్రీనివాస్ రావు, కిసాన్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి పిల్లిబోస్ బాబు, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు షెక్ జాన్ పాషా, తక్కెలపాడు గ్రామశాఖ అధ్యక్షురాలు తాటిమళ్ళ ఉషారాణి, నాయకులు శీలం ప్రతాఫ్ రెడ్డి, ఎస్ కె సమీర్, ఎస్ కె. హుస్సెన్, గ్రామశాఖ అధ్యక్షుడు గంట వెంకటేశ్వర్లు, ఇనగాల సర్పంచ్ ఎరమల వెంకట్ రెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షుడు తలపరెడ్డి రత్నాలురెడ్డి  ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరైయ్యారు.