Telugu News

కామ్రేడ్లతో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి భేటీ

ఖమ్మం గెలుపు దేశానికి మలుపు కావలన్న అభ్యర్థి రఘురాంరెడ్డి

0

కామ్రేడ్లతో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి భేటీ

== ఖమ్మం గెలుపు దేశానికి మలుపు కావలన్న అభ్యర్థి రఘురాంరెడ్డి

(ఖమ్మం-విజయం న్యూస్)

 

కమ్యూనిస్ట్ నేతలను కాంగ్రెస్ అభ్యర్థి కలిసి మాట్లాడారు.

సీ పీ ఐ, సీ పీ ఎం బలపర్చిన కాంగ్రెస్ లోక్ సభ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి ఆదివారం నగరంలోని సీ పీ ఎం జిల్లా కార్యాలయానికి వెళ్ళారు. ఈ సందర్భంగా అక్కడి నాయకులందరినీ కలిసి కరచలనాలు చేశారు. అనంతరం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర రావు, సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వర్లు, కల్యాణం వెoకటేశ్వ రావు తదితరులతో కలిసి సమావేశమయ్యారు. రఘురాం రెడ్డి మాట్లాడుతూ.. కమ్యూనిస్టుల సహకారం మరువలేనదని అన్నారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు దేశానికే మలుపు తిరగాలని, దేశంలో కాంగ్రెస్ అధికారం వచ్చే విధంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలసాని లక్ష్మినారాయణ, తుమ్మల యుగేoధర్, కాంగ్రెస్ నగర కార్యదర్శి మహ్మద్ జావేద్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:- బరువు మోస్తా.. మీ బాధ్యతలు చూస్తా: రఘురాం రెడ్డి