Telugu News

రాజ్యాంగం కాపాడబడాలంటే కాంగ్రెస్ పార్టీకే ఓటెయ్యాలి: శంకర్ నాయక్ 

రామసహాయం రఘురాం రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి: 

0

రాజ్యాంగం కాపాడబడాలంటే కాంగ్రెస్ పార్టీకే ఓటెయ్యాలి: శంకర్ నాయక్ 

== రామసహాయం రఘురాం రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి: 

== ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం

== భారత రాజ్యాంగం కాపాడబడాలంటే కాంగ్రెస్ పార్టీకే ఓటెయ్యాలి
…….ఎస్టి ఎస్సి బిసి మైనార్టీ వర్గాల రిజర్వేషన్ ఫలాలు సక్రమంగా అమలు కావాలంటే అది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే సాధ్యమవుతుంది
—–భారతదేశానికి శ్రీరామరక్ష కాంగ్రెస్ పార్టీ
—–రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ తో సాద్యం
——ఆర్టిఐ మాజీ కమిషనర్ డా.గుగులోతు శంకర్ నానాయక్ పిలుపు.*

(కూసుమంచి -విజయం న్యూస్)
ఈ నెల 13న జరిగే పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలలో భాగంగా రాష్ట్ర సమాచారం మాజీ కమిషనర్ డాక్టర్ శంకర్ నాయక్ గారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ‘కూసుమంచి’ మండల కేంద్రంలోని కాంగ్రెస్ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11గంటలకు జిల్లా నాయకులు పెండ్ర అంజయ్య గారితో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడడం జరిగింది.

*ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామసాయ రఘురాం రెడ్డి గారిని గెలిపించాలని కోరుతూ* పాలేరు నియోజకవర్గం గిరిజనుల
♦️ ఈ మీడియా సమావేశంలో నాయకులు కార్యకర్త లను ఉద్దేశించి వారు మాట్లాడుతూ భారత దేశంలో కాంగ్రెస్ పార్టీ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ గారి నాయకత్వంలో దేశంలో అనేక సవరణలు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేసారని కొనియాడారు. ఇప్పుడు దేశంలో బిజెపి నరేంద్రమోడి ప్రభుత్వం ఈ పది సంవత్సరాలలో పేద ప్రజలకు చేసింది ఏమి లేదని కేవలము మనుషుల మధ్య, కులాల మధ్య చిచ్చు పెడుతూ విభజించి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తూ దేశంలో మణిపూర్ కాశ్మీర్ రాజస్థాన్ తెలంగాణ మేఘాలయం త్రిపుర లాంటి రాష్ట్రాలలో అనేక సమస్యలను సృష్టించి మత విద్వేశాలను రెచ్చకొడుతుందని వారు విమర్శించారు.
🔹 దేశంలో బిజెపి ప్రభుత్వం యువతకు ఉపాధి లేకుండా చేసి, కొంత మంది బడా పెట్టుబడిదారుల అభ్యున్నతి కోసం కృషి చేస్తుందని వారు విమర్శించారు. ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ అంతర్గతంగా బిజెపికి పార్లమెంట్ నియోజకవర్గంలో బిజెపి పార్టీ బిఆర్స్ పార్టీకి అంతర్గతంగా అవగాహన చేసుకొని ప్రచారం కొనసాగిస్తున్నాయని వారు విమర్శించారు.
♦️ కావున మే 13న జరిగే ఎన్నికలలో నియోజకవర్గం లోని అన్ని గ్రామాల్లో పల్లెల్లో, తండాలలో దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే అన్ని వర్గాల ప్రజలకు, యువతకు మేలు జరుగుతుందని విస్తృతంగా ప్రచారం నిర్వహించి రఘురాం గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు.

మోడీ ప్రభుత్వం గరీబోళ్ల కొనుక్కునే సబ్బు మీద, బ్రెష్ మీద, కోల్ గెట్ మీద, ఆహారం మీద సూది మీద బట్టల మీద ఇలా అన్ని మౌలిక సదుపాయాల మీద జిఎస్టి పన్నులు వేసి కోట్ల రూపాయలను బడా పారిశ్రామికవేత్తలకు అంబానీ అదాని నిరోమోడి లాంటి బడా బడా నేతలకు 16 లక్షల కోట్ల రూపాయలను మాఫీ చేసినారు కానీ రైతుల సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసే ధైర్యం కాలేదు అలాంటి నాయకులకు మళ్ళీ ఓటేద్దామా?

భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ శ్రీరామరక్ష అని రాజ్యాంగ పరిరక్షించడం కాంగ్రెస్ పార్టీ తోనే సాద్యం అవుతుందని
సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మండల ప్రజలను ఆర్టిఐ మాజీ కమిషనర్ డా.గుగులోతు శంకర్ నాయక్ కోరారు.

ఈ మేరకు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం గత పది సంవత్సరాల పాలనలో బడుగు బలహీన ఎస్టి, ఎస్సి, బిసి, హరిజన, గిరిజనులకు ఒరిగింది ఏమీ లేదని, పేద, వెనకబడిన వర్గాల ప్రజల అభ్యున్నత కోసం పాటుపడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. హస్తం గుర్తు – పేదోళ్లకు నేస్తం అందుకోసమే మే 13వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు గాబరా గాబరా కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రాహుల్ గాంధీ నీ ప్రధానమంత్రి చేసుకొవాలని పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నత సంక్షేమ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందని తెలిపారు. కావున మళ్లీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది. రాజ్యాంగాన్ని మారుస్తాం రిజర్వేషన్లు తీసేస్తామన్న మాటల్ని పటాపంచలు చేయాలంటే కాంగ్రెస్ పార్టీకీ ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించి అభివృద్ధిలో భాగ్య స్వాములుకావాలన్నారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి, చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని శంకర్ నాయక్ కోరారు.
🔹 ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ నాయకులు, మరియు తదితరులు పాల్గొన్నారు.