Telugu News

పేదల రాజ్యం రావాలంటే కాంగ్రెస్ గెలవాలి: భట్టి

నకిరేకల్ నియోజకవర్గంలో జోరుగా సాగుతున్న పాదయాత్ర

0

పేదల రాజ్యం రావాలంటే కాంగ్రెస్ గెలవాలి: భట్టి

== ప్రజల సమస్యలు కేసీఆర్ కు అవసరం లేదు

== స్వలాభం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు

== పేదల కోసం, ప్రజా సమస్యల కోసం కోట్లాడుతున్నం

== ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు

== ప్రజల బతుకులు బాగుచేయలేని అసమర్థత ప్రభుత్వాలను దింపేద్దాం

==ఆత్మ గౌరవ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ ను గెలిపించండి

== పిపుల్స్ మార్చ్ పాదయాత్రలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

== నకిరేకల్ నియోజకవర్గంలో జోరుగా సాగుతున్న పాదయాత్ర

== అడుగడుగున నిరాజనం పాలుకుతున్న జనం

(నకిరేకల్/ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

పేదల రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలని, ఇందిరమ్మ రాజ్యంతోనే ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయని, అందుకే ప్రజలందరు ఇందిరమ్మ రాజ్యంకోసం కాంగ్రెస్ ను గెలిపించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నకిరేకల్ నియోజకవర్గంలోని కొప్పోలు గ్రామం నుంచి 101వ రోజున పాదయాత్ర ప్రారంభమైంది.  నకిరేకల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ లో జన సునామి కనిపించింది. పాదయాత్రలో స్వచ్ఛందంగా పాల్గొంటున్న ఆడబిడ్డలు, మహిళలు, వృద్ధులు, గ్రామస్తులు,  ప్రజలు కాంగ్రెస్ జెండాలతో పాదయాత్రలో పాల్గొంటున్నారు.

ఇది కూడా చదవండి: సీఎల్పీనేత భట్టి విక్రమార్క ను కలిసిన పొంగులేటి

ప్రజలందరు పెద్ద సంఖ్యలో పాదయాత్ర వద్ద వస్తూ అడుగడుగున నిరాజనాలు పలుకుతున్నారు. మహిళలు హారతులీస్తూ, తిలకం దిద్ది ఆశీర్వదిస్తున్నారు.   సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో ఆయా గ్రామాల్లో పర్యటించినప్పుడు గ్రామస్తులను పేరుపేరునా పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. దీంతో భట్టి విక్రమార్క పెద్దలు, చిన్నారులు దగ్గరకు వచ్చి ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో జరిగిన సభలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో గ్రామాల్లో పెరుగుతున్న కాంగ్రెస్ బలం పాదయాత్ర ఆడిలాబాద్ అదిలాబాద్ అడవుల నుంచి మొదలైంది. వందల కిలోమీటర్లు నడుచుుంటూ వచ్చాను. ప్రజల సమస్యలన్నీ విన్నాను. గోండు గూడెంలోని ఆదివాసీలు, బలమీన వర్గాలు, రైతులు, యూనవర్సిటీ విద్యార్థులు, కూలినీలి చేసుకునే నిరుపేద ప్రజలు, దళితులు, వ్రుత్తి చేసుకునే గొల్లకుర్మలు, గీత కార్మికులతో మాట్లాడాను. వెళ్లిన ప్రతి చోటా చెప్పింది ఒక్కటే.. ఈ రాష్ట్రం కోసం కోట్లాడాం.. సకల జనుల సమ్మె పాల్గొన్నాం. మాబిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని , ఇండ్లు, ఇండ్ల స్థలాలు, విద్య, వైద్యం విషయంలో ప్రభుత్వం సహకరిస్తుందని  ఆశపడ్డాం. భయంలేని, స్వేచ్ఛతో, ఆత్మ గౌరవంతో  కూడిన తెలంగాణ సమాజం ఏర్పడుతుందని ఆశించాం.. కానీ అదేమీ జరగేలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో 70-80 ఏళ్ల కిందటనున్న బాంచన్ దొరా అనే ఫ్యూడల్ వ్యవస్థను తీసుకువచ్చారని, ప్రజలకు సంభంధించిన సంపద మొత్తం ఆయనే దోపిడీ చేస్తున్నాడు. బీఆర్ఎస్ లోని ప్రభుత్వ పెద్దలంతా సంపదను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.

ఇది కూడా చదవండి: భట్టి విక్రమార్క అభిమన్యుడు కాదు అర్జునుడు

అందుకే మన రాష్ట్రం మనకు వచ్చినా.. ధనిక రాష్ట్రంగా ఉన్నా.. ప్రజల నిరుపేదలగానే మిగిలిపోయారన్నారు. తెలంగాణ సమాజం మొత్తం పీపుల్స్ మార్చ్ పాదయాత్రను ఆశీర్వదిస్తోందని,  తప్పనిసరిగా ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలని.. ప్రజలంతా మాతో చెబుతున్నారని అన్నారు.  పేద ప్రజలందరికీ మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలని చెబుతున్నారని, కచ్చితంగా వారందరికి ఆశయ సాధనే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. కొప్పోలు గ్రామంలో మేం పాదయాత్ర చేస్తున్న సమయంలో మహిళలు గుంపులుగుంపులుగా మా వద్దకు వచ్చారని,  మేం పేదోళ్లం.. వెనుక‌బ‌డ్డోళ్లం. మీరే మాకు కొండంత అండం.. ధైర్యం. అందుకే ఈ రోజు బయటకు వచ్చి మీతో నడుస్తున్నామని నాతో చెబుతుంటే నాకు మరింత ధైర్యం వచ్చిందన్నారు. నాకు ఆరోగ్యం బాలేకపోయిన సమాయనుకూలంగా పాదయాత్రను పూర్తి చేయాలని నడుస్తుంటే మహిళలు, ప్రజలు నన్ను ఆశీర్వదించేందుకు వస్తున్న తీరు, వారు ఆశీర్వదిస్తున్న తీరు నన్ను శక్తివంతుడ్ని చేస్తున్నాయని అన్నారు.  మీరు అధికారంలోకి రావాలి.. మాకు అన్నీ చేయాలి. మా బిడ్డ‌లకు ఉద్యోగాలు ఇవ్వాలి.మాకు ఇండ్లు ఇవ్వాలి.. ఇండ్ల స్థలాలు ఇవ్వాలి. మేము బ‌తికేంద‌కు కావాల్సిన ఆర్థిక వ‌న‌రులు పంచాలని మహిళలు చెబుతుంటే ధైర్యం వస్తుందన్నారు. కచ్చితంగా ఆ మహిళలు అడిగినవన్ని చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా సిద్దంగా ఉంటుందన్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇందిరమ్మ రాజ్యమే వస్తుంది. రాష్ట్ర సంపద పాలకుల కోసం కాదు.. దొరల కోసం కాదు. ప్రజల కోసం మాత్రమే.. ఆ ప్రజలకే పంచుతామని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: వైఎస్ షర్మిళ దారేటు..? నేతల రూటేటు..?

ఇండ్లు లేని ప్రతి పేద కుటుంబానికి రెండు గదుల ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలిస్తామని, వంటింటి గ్యాప్ ధరను రూ.500కే ఇస్తామని,  అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తామని, రేషన్ షాపులో 9 రకాల నిత్యావసర సరుకులు పెట్టి అందిస్తామని తెలిపారు.  రైతులకు రూ. 2 లక్షల రుణాలను ఏక కాలంలో మాఫీ చేస్తామని, ప్రతి ఇంట్లో ఉన్న ముసలవ్వకు, తాతకు ఇద్దరికీ పింఛన్ ఇస్తామని, రైతుతో పాటు రైతు కుటుంబాలకు బీమా చేస్తామని తెలిపారు.  కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత నిర్భంధ ఆంగ్ల విద్యను అందిస్తామని, అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి చూపిస్తామన్నారు.  నిరుద్యోగులకు ప్రతి నెలా రూ. 4వేలు నిరుద్యోగ భ్రుతి ఇస్తామని, ధరణిని బంగాళఖాతంలో కలుపుతామని, రైతులను రక్షించుకుంటామని, అర్హులైన రైతులకు పట్టాలిస్తామని భరోసానిచ్చారు.  మళ్లీ వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీకి రుణాలు ఇస్తామని, ఆమ్ ఆద్మీ బీమా యోజనతో వంద రోజుల కూలీలకు ఇన్సూరెన్స్ చేయిస్తామని తెలిపారు.  ప్రీమియం ప్రభుత్వమే కడుతుందని హామినిచ్చారు.

పీపుల్స్ మార్చ్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నాడు. కేసీఆర్ లాంటి వాళ్లను కాంగ్రెస్ పార్టీ చాలామందిని చూసింది. కాంగ్రెస్ పార్టీ నిన్ను బంగాళాఖాతంలో ఏసే రోజు ఎంతో దూరంలో లేదని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. రైతుబంధుతోపాటు.. నిరుపేద కూలీలకు ఏడాదికి రూ.12వేలు ఇచ్చేలా కూలీబంధు తీసుకోస్తామని హామినిచ్చారు.  రైతులకు భూమి మీద హక్కు కల్పించిందే కాంగ్రెస్ పార్టీ అని,  టెన్నెన్సీ చట్టంతో తెలంగాణ రైతులకు హక్కు కల్పించింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో శంకర్ నాయక్, ఎంపీపీ శేఖర్, ఎంసీపీ శ్రీనివాస్, సింగిల్ విండో ఛైర్మన్ వెంకట్ రెడ్డి, వేదా శ్రీధర్, నరేందర్, నకిరేకల్ కౌన్సిలర్ సుకన్య స్థాని నాయకలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: పొంగులేటిని కలిసిన రేవంత్ రెడ్డి