Telugu News

పేదల ప్రభుత్వం రావాలంటే కాంగ్రెస్ గెలవాలి

52వ డివిజన్ లో మువ్వా ‘గడపకు గడపకూ కాంగ్రెస్’

0

పేదల ప్రభుత్వం రావాలంటే కాంగ్రెస్ గెలవాలి

== కాంగ్రెస్ పార్టీని ప్రజలే గెలిపిస్తారు

== 52వ డివిజన్ లో మువ్వా ‘గడపకు గడపకూ కాంగ్రెస్’

(ఖమ్మం-విజయంన్యూస్):

గడప గడపకూ కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ఆ పార్టీ మేనిఫెస్టో కమిటీ సభ్యులు మువ్వా విజయబాబు 52వ డివిజన్ లో మంగళవారం సాయంత్రం నిర్వహించారు. డివిజన్లోని ప్రతి గడపకు తిరుగుతూ| కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అమలు చేయబోయే సంక్షేమ పథకాలను కరపత్రాన్ని అందజేసి వివరించారు.

ఇది కూడా చదవండి:- తెలంగాణలో పిపుల్స్ సర్కార్ తథ్యం

వృద్ధులను, వికలాంగులను, మహిళలను, చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారం చేపట్టాక ఆ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మువ్వా మాట్లాడుతూ ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని రాబోవు మూడునెలల్లో కాంగ్రెస్ పార్టీదే అధికారమని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలోని అన్ని ప్రధాన సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు.

ఇది కూడా చదవండి:- ఖమ్మం కాంగ్రెస్ మీటింగ్ లో గలాట