చచ్చిన పీనుగు కాంగ్రెస్ పార్టీ: మంత్రి కేటీఆర్
150 ఏళ్ల క్రితం పుట్టిన కాంగ్రెస్ పార్టీ వారెంటి అయిపోయింది
చచ్చిన పీనుగు కాంగ్రెస్ పార్టీ: మంత్రి కేటీఆర్
== అరిగిపోయిన గ్రామ్ ఫోన్ కాంగ్రెస్
== 150 ఏళ్ల క్రితం పుట్టిన కాంగ్రెస్ పార్టీ వారెంటి అయిపోయింది
== 6 గ్యారెంటీ లు ఆరిపోయే దీపాలు మాత్రమే
== కేసీఆర్ దేవుడు అని పొగిడిన వారే.. దుర్మార్గుడంటున్నారు
== కాంగ్రెస్ పార్టీపై మండిపడిన మంత్రి కేటీఆర్
== రైతు బందువు ఎవరు.. రాబందు ఎవరో ప్రజలు ఆలోచించాలి
== స్వాతిముత్యం సినిమాలో కమలహాసన్ ‘సండ్ర’
== వెయ్యి కోట్ల సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ది కి ఖర్చు పెట్టాం
== ఈ నియోజకర్గంలో ప్రతి దళిత కుటుంభానికి దళిత బంద్ పథకం అమలు చేస్తాం
== హామిల వర్షం కురిపించిన మంత్రి కేటీఆర్
== సత్తుపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు కేటీఆర్, ప్రశాంత్, పువ్వాడ
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అరిపోయిన దీపంలాంటిదని, 150ఏళ్ల క్రితం పుట్టిన కాంగ్రెస్ పార్టీ అరిగిపోయిన గ్రామ్ పోన్ లాంటిదని, వారంటీ అయిపోయిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కాంగ్రెస్ పార్టీపై ద్వజమెత్తారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి ప్రత్యేక హెలికాప్టర్ లో వచ్చిన మంత్రి కేటీఆర్ సత్తుపల్లి నియోకవర్గంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన శిలాపలకాలను అవిష్కరించారు. ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన పలు అభివృద్ది పనులకు మంత్రులు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ అరిగిపోయిన గ్రామ్ పోన్ లా పదేపదే అదే విషయాన్ని పాతచింతకాయ పచ్చడిని కొత్త పచ్చడి అన్నట్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
ఇది కూడా చదవండి: మున్నేరు వరదబాధితులకు అండగా ఉంటాం: మంత్రి కేటీఆర్
150ఏళ్ల క్రితం పుట్టిన పార్టీకి ఇంకా ఆయుస్సు ఉంటుందా..? వారెంట్ అయిపోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఆ పార్టీని పట్టుకుని కొందరు మన పార్టీ నుంచి పోయినోళ్లు బీఆర్ఎస్ పార్టీని ఏదో చేస్తామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని, వాళ్ల ఆటలు తెలంగాణలో సాగవని యద్దేవా చేశారు. ఓడిపోయి ఇంట్లో కూర్చున్న ఓ పెద్ద మనిషిని జిల్లా స్థాయిలో పెద్ద పదవిలో కుర్చోపెట్టి అభివద్ది కోసం అద్భుతమైన నిధులు మంజూరు చేస్తే పరిపాలన చేతగాక ఓడిపోయి, వారి చేతగాని తనాన్ని ఒప్పుకోకుండా మాపై నిందలేస్తున్నారని దుయ్యబట్టారు. ఓడిపోయిన వ్యక్తిని మంత్రి చేసిన ఘనత కేసీఆర్ దేనని, అలాంటి కేసీఆర్ ను విమర్శించి పార్టీ నుంచి వెళ్లిపోయారన్నారు. పదవి రాలేదని మాత్రమే విమర్శలు చేస్తున్నారని అన్నారు. దేవుడు అని పొగిడిన వారే నేడు కేసీఆర్ దుర్మార్గుడు అనటం ఎంత వరకు సమంజసం వారికే తెలియాలని అన్నారు. ప్రజలందరు గమనిస్తున్నారని, సరైన సమయంలో బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని పేర్కొన్నారు. గ్యారెంటీ అంటూ కాంగ్రెస్ నాయకులు కొత్త కొత్త డైలాగ్ లు వాడుతున్నారని, 6 గ్యారంటీ పథకాలు అరిపోయే దీపాలు మాత్రమేనని విమ్మర్శించారు. కాంగ్రెస్ కు హైద్రాబాద్ లో లోకామెండ్,బెంగుళూరు లో న్యూకామెండ్, ఢిల్లీలో హైకమేండ్ అంటూ విమర్శలు చేశారు.
== ముసలి నక్క కాంగ్రెస్ :మంత్రి కేటీఆర్
భారతదేశంలో ఎక్కడ కూడా రూ.4 వేలు పించన్ ఇవ్వటం లేదని, 60 ఏళ్లు 200 పెన్షన్ ఇచ్చిన కాంగ్రెస్ వాళ్ళు నేడు రూ.4 వేలు ఇస్తామంటే ఎలా నమ్మాలని ఆరోపించారు. 150 సంవత్సరాల ముసలి నక్క కాంగ్రెస్..వాళ్ళను నమ్మితే కుక్క తోక పట్టుకుని గోదారి ఇదినట్టేనని దుయ్యబట్టారు. 6 దశాబ్దాలు మనల్ని సతాయించిన వాళ్ళు ఇప్పుడు వచ్చి 6 గ్యారెంటీ లు అంటే నమ్మేద్దామా.?? అంటూ ప్రశ్నించారు. ప్రజలందరు ఆలోచన చేయాలని కోరారు. 75 ఏళ్ల లో 11 సార్లు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారని, ఏనాడు కూడా ప్రజల గురించి ఆలోచించలేదన్నారు.
ఇది కూడా చదవండి: వారంటీ లేని కాంగ్రెస్ ను తరమికొట్టాలే: కేటీఆర్
ప్రభుత్వం లో ఉన్నప్పుడు పనులు చేయటం చేతకాదు కానీ ఒక్క అవకాశం ఇవ్వాలని ఇప్పుడు కోరుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే మూడు గంటల కరెంట్,ఏడాదికో ముఖ్య మంత్రి,అన్ని కుంభకోణాలు గ్యారెంటీ అని ఆరోపించారు. దోచుకోవడం తప్ప ఇంకొకటి తెలియదని కాంగ్రెస్ పై మంత్రి కేటీఆర్ ద్వజమెత్తారు. టికెట్ ల కోసం కోట్ల రూపాయలకు సీట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.
== కర్ణాటక నుండి వందల కోట్లు వస్తున్నాయ్.. జాగ్రత్త
కాంగ్రెస్ కోసం కర్ణాటక ప్రభుత్వం వందల కోట్లను సూటికేస్ లో పంపిస్తోందని, ప్రజలందరు డబ్బులకు అమ్ముడు పోవ్వోద్దని, ఆలోచన చేసి ఓట్లేయాలని మంత్రి కేటీఆర్ కోరారు. కాంగ్రెస్ వాళ్లు డబ్బులు ఇస్తే తీసుకుని ఓటు మాత్రం కార్ గుర్తు కే వేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందంటే.. తెలంగాణ టూ ఢిల్లీ వయా బెంగుళూరు అన్నట్లుగా ఉందన్నారు. గతంలో అధిష్టానం మాత్రమే ఉండేదని, ఇప్పుడు వయా అనే స్టాఫ్ ఏర్పడిందన్నారు. అక్కడ నుంచే తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. గతంలో ఆంధ్రోళ్ల చేతిలో కాంగ్రెస్ నేతలు అన్నట్లుగా ఉండేదని, ఇప్పుడు బెంగుళూరోళ్ల చేతిలో తెలంగాణ కాంగ్రెస్ అన్నట్లుగా ఉందన్నారు.
== సంక్షేమాభివద్దిలో తెలంగాణే నెంబర్ వన్
భారతదేశంలో సంక్షేమాభివద్దిలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని, ఎన్నో రాష్ట్రాలకు ఎన్నో తెలంగాణ పథకాలు అదర్శంగా నిలిచాయని అన్నారు. దేశంలోనే ఆదర్శ పరిపాలన అందిస్తున్న ఏకైక సీఎం కల్వకుంట చంద్రశేఖర్ రావు మాత్రమేనని స్పష్టం చేశారు. రూ73 వేల కోట్లను రైతులకు రైతు బందు పేరుతో సీఎం కేసీఆర్ లబ్ధిదారులకు అకౌంట్ లలో వేశారని తెలిపారు. సీఎం కేసీఆర్ వచ్చాక రూ.43 వేల కోట్లతో తెలంగాణ రాష్ట్రం లో ఇంటింటికీ నల్లా నీళ్ళు ఇచ్చామని, నిరంతరం 24గంటల పాటు ఉచిత విద్యుత్ ను అందిస్తున్నామని తెలిపారు. 24 గంటలు కరెంట్ ఎక్కడ వస్తుంది అని కాంగ్రెస్ ఎంపీ అడుగుతున్నాడు, ఖమ్మం జిల్లా కు వచ్చి కరెంట్ తీగలను గట్టిగా పట్టుకుని చూస్తే కరెంట్ వస్తుందో రాదో అని తెలుస్తుందని సూచించారు.
ఇది కూడా చదవంఢి :మాకు రాముడైన, కృష్ణుడైన ఎన్టీఆర్ : కేటీఆర్
రెండు టర్ముల్లో గతం లో ఎన్నడూ లేనంత అభివృద్ది తెలంగాణ ప్రభుత్వం చేసింది. ఆడబిడ్డలకు కేసీఆర్ మేనమామ లా పెళ్లిళ్లు చేశారని, కాంగ్రెస్ హయం లో ప్రభుత్వ హాస్పటల్ దయనీయ పరిస్థితిపై సినిమాలో పాటలు వచ్చేవి..నేడు ఆ పరిస్థితి లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో 26 లక్షల మంది కి 200 పెన్షన్ వచ్చేదని, నేడు తెలంగాణ లో 46 లక్షల మందికి రూ.2వేల నుంచి 3వేల వరకు పెన్షన్ వస్తుందన్నారు. తండాలు కావాలన్న దశాబ్దాల డిమాండ్ ను నెరవేర్చింది కేసీఆర్ మాత్రమేనని గుర్తు చేశారు.
== అన్ని రంగాల్లో సత్తుపల్లి అభివృద్ది
సత్తుపల్లి కి నర్సింగ్,పాల్ టెక్నిక్ కళాశాల లు కేసీఆర్ మంజూరు చేసింది సీఎం కేసీఆర్ మాత్రమేనని తెలిపారు. రూ.890 కోట్లు సత్తుపల్లి నియోజకవర్గం లోని రైతులకు రుణమాఫీ కింద జమైయ్యాయని అన్నారు. 90 శాతం సీతారామ ప్రాజెక్ట్ పనులు పూర్తి అయ్యాయని, గోదావరి జలాలు తెచ్చి ఏడున్నర లక్షల ఎకరాలకు నీరు తాడుపుతామని హామినిచ్చారు. ఎవరు రైతు బందు ఎవరు రాబందు ప్రజలు ఆలోచన చేయాలని ప్రజలను కోరారు. సత్తుపల్లి నియోజక వర్గం లోని ప్రతి దళిత కుటుంభానికి దళిత బంద్ పథకాన్ని అమలు చేస్తామన్నారు. హుజూరాబాద్ తరువాత సత్తుపల్లి లో దళిత బంద్ అమలు చేశామని, ప్రత్యేక అధికారులను నియమించి దళిత బంద్ అమలు చేయాలని సూచించారు. గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతాం.చివరి యాదవ సోదరుడి వరకు గొర్రెలు పంపిణీ చేస్తామన్నారు.
ఇది కూడ చదవండి: బీఆర్ఎస్ గెలుపే అభివద్దికి మలుపు: మంత్రి కేటీఆర్
వెయ్యి కోట్ల సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ది కి ఖర్చు పెట్టామని సూచించారు. భారత దేశం లో ఆశా వర్కర్లకు తెలంగాణ అత్యధిక వేతనాలు ఇస్తుందన్నారు. చెప్పుడు మాటలు విని ఆశా వర్కర్లు ఇబ్బంది పడొద్దు.ఆందోళనను విరమించాలని కోరారు. స్వాతిముత్యం సినిమాలో కమలహాసన్ లాంటి వాడు సండ్ర వెంకటవీరయ్య అని మంత్రి కేటీఆర్ కొనియాడారు. సత్తుపల్లి జిల్లా కావాలంటే వెంకట వీరయ్య ను గెలిపించాలని కోరారు.
== సామాన్యుడ్ని మూడు సార్లు గెలిపించింది మీరే: సండ్ర
అత్యంత సామాన్యుడినైన నన్ను సత్తుపల్లి ప్రజలు ఆశీర్వదించి, ప్రభుత్వం లేకపోయిన మూడు సార్లు వరసగా గెలిపించి నన్నింతటి వాడ్ని చేశారని, మీ అందరి రుణం ఎలా తీర్చుకోవాలో కూడా నాకు తెలియడం లేదని, ఎంత పనిచేసిన మీ రుణం తీర్చలేమోననేమోనని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సత్తుపల్లి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మూడు సార్లు గెలిచిన ఏనాడు నేను అహంతో అహంభావంతో పనిచేయలేదన్నారు. ప్రజలతో కలిసిపోయి పనిచేశానని, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నం చేశానని అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ది కి వందల కోట్ల రూపాయలను కేసీఆర్,కేటీఆర్ మంజూరు చేశారని తెలిపారు. మూడు వైద్య విధాన పరిషత్ లు కేవలం సత్తుపల్లి నియోజకవర్గం లో మాత్రమే ఉన్నాయని అన్నారు. దళితుడైన నేనే సత్తుపల్లి లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. బిఅర్ఎస్ అధికారం లోకి వచ్చాక ఎం అభివృద్ది జరుగుతుందో ప్రజలు ఆలోచన చేయాలని అన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవ పతాకాన్ని ఎగుర వేసింది యన్టిఆర్ శిష్యుడు కేసీఆర్ అని కొనియాడారు. ప్రపంచం లోనే గుర్తింపు తెచ్చేలా కేసీఆర్ పాలన ఉందని, ఆయన పాలనలో నేను ఉండటం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు హెలికాప్టర్ ద్వారా సత్తుపల్లిలోని జలగం వెంగళరావు స్మారక కళాశాల ప్రాంగణానికి చేరుకున్నారు.
ఇది కూడా చదవండి: పొలాలకు డొంక రోడ్లు వేసా: మంత్రి పువ్వాడ
ఈ సందర్భంగా సత్తుపల్లికి విచ్చేసిన వారికి స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నాయకత్వంలో వేలాది మంది తరలివచ్చి అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రచారరథంపై గులాబీ శ్రేణులకు అభివాదం చేస్తూ పురవీధుల గుండా సభాస్థలికి చేరుకున్నారు. సత్తుపల్లిలో రూ.90కోట్లతో చాకలి ఐలమ్మ దోభీఘాట్, డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ ఆడిటోరియం, షాధీఖానా, క్రిస్టియన్ భవన్, బస్టాండ్-ఎన్టీఆర్ నగర్ రోడ్డు విస్తరణ తదితర పనులకు వారు కలిసి శంకుస్థాపనలు చేశారు.