Telugu News

బంద్ ను జయప్రదం చేయండి

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటి, నగర కమిటీ పిలుపు

0

నెల 27వ తేదీన భారత్ బంద్ ను విజయవంతం చేయండి

** ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ. జావిద్

(ఖమ్మం- విజయం న్యూస్)

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 27న 19 రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ, కార్మిక, మహిళా, విద్యార్థి, యువజన సంఘా లు తదితరులు తలపెట్టిన భారత్ బంద్ లో భాగస్వామ్యం అయి భారత్ బంద్ కు సహకరించాలని నగర కాంగ్రెస్ కమిటీ అన్ని డివిజన్ అధ్యక్షులు, ఖమ్మం నగర కార్పొరేటర్లు అందరినీ కోరడం జరిగింది.  ఖమ్మం నగరంలోని అన్ని రాజకీయ పక్షాల నగర నాయకులు అందరికీ పత్రికాముఖంగా విన్నవించడం అయినది.
ఈ సందర్భంగా మహమ్మద్ జావేద్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు మాట్లాడుతూ దేశ సంపద కార్పొరేట్ కంపెనీలకు మోడీ ప్రభుత్వం దోచి పెడుతుందని, భారతమాతని అమ్మకానికి పెడుతుందని, అనేక పోరాటాలు త్యాగాలతో సాధించుకున్న భారతదేశాన్ని తిరిగి కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెట్టడమే ధ్యేయంగా బీజేపీ పాలన కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఏమాత్రం తీసిపోని పద్ధతిలో ప్రభుత్వ భూముల వేలం ద్వారా వచ్చిన ఆదాయంతో ప్రభుత్వ పాలన కొనసాగించాలని చూస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ భారత్ బంద్ లో అన్ని వర్గాల వారు భాగస్వామ్యం కావడం ద్వారా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు మరియు జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం గారు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దెబ్బల సౌజన్య కార్పొరేటర్లు మలేదు వెంకటేశ్వర్లు దుద్దుకూరు వెంకటేశ్వర్లు సైదులు నాయక్ నిరంజన్ రఫీ దా బేగం పల్లె బోయిన చంద్రం మరియు ఏ బ్లాక్ అధ్యక్షులు గంగాధర్ తిలక్ నగర కాంగ్రెస్ నాయకులు బాణాల లక్ష్మణ్ రజి అబ్బాస్ ముజాహిద్ హుస్సేన్ గజిలి సంపటం నరసింహారావు రఘునాధపాలెం మండలం బాధ్యులు దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు గడ్డం వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు

also read : ఖమ్మం మార్కెట్ చైర్మన్ కు వినతి