Telugu News

కాంగ్రెస్ పార్టీ ద్రోహి కందాళ: భట్టి విక్రమార్క

 కష్టపడి గెలిపిస్తే కార్యకర్తలను నట్టేట ముంచేసి పైసల కోసం పార్టీ మారారు

0

కాంగ్రెస్ పార్టీ ద్రోహి కందాళ: భట్టి విక్రమార్క

==  కష్టపడి గెలిపిస్తే కార్యకర్తలను నట్టేట ముంచేసి పైసల కోసం పార్టీ మారారు

== గెలిపించిన కార్యకర్తలపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారు

== మోసం చేసినోళ్లను పాలేరు నుంచి తరిమికొట్టాలి

== ఇందిరమ్మ రాజ్యంతోనే ఇంటింటికి సంక్షేమం

==కొట్లాడి కోరి తెచ్చుకున్న రాష్ట్రంలో గద్దలేక్కువైనయ్

==  తెలంగాణ లక్ష్యాలు నీరుగార్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం

== కృష్ణ, గోదావరి నదుల నుంచి పొలాల్లోకి పారాల్సిన నీళ్ళు రాకుండా చేస్తున్నది బీఆర్ఎస్ సర్కార్

== తెలంగాణ ప్రజల సంపదను దోపిడీ చేస్తున్న బిఆర్ఎస్ పాలకులు

== కేసీఆర్ పదేళ్ల పరిపాలనను ఇక  చాలు అంటున్న తెలంగాణ ప్రజలు

== నాయకన్ గూడెం కార్నర్ మీటింగ్ లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

(కూసుమంచి-విజయంన్యూస్)

కాంగ్రెస్ పార్టీ ద్రోహి పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అని, కార్యకర్తలందరు కష్టపడి ఓ మంత్రిపై గెలిపిస్తే కార్యకర్తల మనోభావాలను నట్టేట ముంచేసి పైసల కోసం పార్టీ మారాడని, అలాంటి వారి గురించి మాట్లాడాలంటే సిగ్గుగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రజలను, కార్యకర్తలను మోసం చేసిన ఎమ్మెల్యేను పాలేరు నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.సీఎల్పీ నేత చేపట్టిన పాదయాత్ర బుధవారం ఖమ్మం జిల్లాకు చేరుకోగా నాయకన్ గూడెం గ్రామంలో కార్నిర్ మీటింగ్ జరిగింది.

ఇది కూడా చదవండి: జులై 2 న ఖమ్మంలో ‘తెలంగాణ జన గర్జన’ సభ

ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి ఆ పార్టీకి ద్రోహం చేసి వేలమంది ఓట్లను వేల కోట్ల కాంట్రాక్టుల కోసం పార్టీ మారిన ద్రోహి  ఎమ్మెల్యే కందాళ అని ఆరోపించారు.  ప్రజా ప్రతినిధి అంటే ప్రజల కోసం పనిచేయాలి తప్పా… ప్రభుత్వంతో బేరసారాలు పెట్టుకొని బ్రతకడం కాదని దుయ్యబట్టారు. పాలేరు నియోజకవర్గం లో పేదల భూములు ఎట్ల కబ్జా చేస్తున్నారని, కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో బయటకు తీసి తప్పు చేసినోళ్లను చెమడాలు తీస్తామని ఆరోపించారు. ధరణి పేరిట భూ అక్రమాలకు పాల్పడితే ఎట్లా అని ప్రశ్నించారు. నాగార్జునసాగర్ కాలువలపై ఉన్న మట్టిని ఎట్లా అమ్ముతారని, పాలేరు ఎమ్మెల్యేని చూస్తుంటే ముక్కు మీద వేలేసుకొని జనాలు సిగ్గుపడుతున్నారని అన్నారు. మాజీ మంత్రి సంభాని చంధ్రశేఖర్ ఎమ్మెల్యేగా, మంత్రిగా చాలా కాలం పనిచేశారని, నియోజకవర్గం వదిలి సత్తుపల్లి వెళ్లిపోయి 20 ఏళ్లు అవుతున్న నేటికి ఆయనకు పాలేరులో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అది కదా ప్రజాపరిపాలన అంటే అని కొనియాడారు. కాంగ్రెస్ నుంచి కత్తుల శాంతయ్య, పొట్టపెంజర హుస్సెనయ్య, రాంరెడ్డి వెంకట్ రెడ్డి ఎమ్మెల్యేలుగా పనిచేశారని, వెంకన్న మంత్రిగా కూడా పనిచేశారని, కానీ ఎక్కడ కూడా నమ్ముకున్నవాళ్లను ముంచిపోలేదన్నారు. వారి పాలనలో చిన్న మచ్చలేదని, అందుకే కాంగ్రెస్ పార్టీని పాలేరు నియోజకవర్గంలో ఆదరిస్తున్నారని అన్నారు. ఆనాడు ప్రజల కోసం నాయకులు పనిచేయడం వల్లనే పాలేరు కాంగ్రెస్ కంచుకోటగా ఉందన్నారు.

ఇది కూడా చదవండి: పేదల రాజ్యం రావాలంటే కాంగ్రెస్ గెలవాలి: భట్టి

నేటి ఎమ్మెల్యేలు పైసల కోసం, పనుల కోసం పార్టీలు మారడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత రాదా..? ప్రజలు విశ్వసిస్తారా..? అని పశ్నించారు. పాలేరు నుంచి సంబాని చంద్రశేఖర్, రాంరెడ్డి వెంకటరెడ్డి కత్తుల శాంతయ్య తదితరులు ప్రజల సొమ్మును పోగేసుకోకుండా ప్రజల కోసం తమ జీవితాలను త్యాగం చేశారని కొనియాడారు. ఉండటానికి సైతం ఇల్లులేనటువంటి వారు పరిపాలన చేసిన ఎన్ని రోజులు అవినీతి మచ్చ లేకుండా ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. 2023- 24 సంవత్సరంలో జరిగే ఎన్నికల్లో పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పాలని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సమాజం ఏకం చేద్దాం ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుందామని కోరారు. తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా అప్పులు చేసి రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టిన బిఆర్ఎస్ ను  దింపి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు.అధికారం తలకెక్కి పొగరిక్కీ అడ్డగోలుగా కేసులు పెడుతూ ప్రశ్నించే గొంతుకులను ఇబ్బంది పెడుతున్న బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దింపడానికి చేస్తున్న మార్చ్.. పీపుల్స్ మార్క్స్ పాదయాత్ర అని అన్నారు.