కాంగ్రెస్ పార్టీ లక్ష్య సాధకడు విక్రమార్కుడు: జావిద్
ఖమ్మం అంబేద్కర్ సెంటర్ వద్ద కేక్ కటింగ్ చేసిన కాంగ్రెస్ నేతలు
కాంగ్రెస్ పార్టీ లక్ష్య సాధకడు విక్రమార్కుడు: జావిద్
== రాష్ట్రాన్ని ప్రగతి పథం వైపు నడిపించే నాయకుడు
== ప్రజలను ఓదారుస్తూ విజయవంతంగా 600 కిలోమీటర్ల పాదయాత్ర
== అభినందలను తెలిపిన నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్
== ఖమ్మం అంబేద్కర్ సెంటర్ వద్ద కేక్ కటింగ్ చేసిన కాంగ్రెస్ నేతలు
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
కాంగ్రెస్ పార్టీ లక్ష్యసాధకుడు రాష్ట్రాన్నే ప్రగతి పదం వైపు నడిపించే సత్తా ఉన్నదీరుడు బట్టి విక్రమార్క కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జావేద్ కొనియాడారు. భట్టి విక్రమార్క మొదలుపెట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 49రోజుల్లో 600 కిలోమీటర్లు చేరుకున్న సందర్భంగా ఆయనకు అభినందనలు తెలుపుతూ నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖమ్మం జడ్పీసెంటర్ వద్ద గురువారం కేక్ కటింగ్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు జావేద్ మాట్లాడుతూ… కన్నీటి గాథలతో నిండిపోయిన జీవితాల్లో వెలుగులు నింపడమే తన లక్ష్యంగా అట్టడుగున నలిగే వారికి వెలుగై ఒక సైనికునిల కదులుతున్న నాయకుడు భట్టి విక్రమార్క అని అన్నారు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యం: జావిద్
అగ్గికి ఆహుతై, బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణలో బడుగు, బలహీన, అణగారిన, అట్టడుగు వర్గాలు, మైనారిటీ ప్రజలను తిరిగి బలవంతంగా నిజాం కాలం నాటి బానిసత్వవు, వెట్టి చాకిరీలోకి బలవంతంగా నెట్టివేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని అన్నారు. ఈ కుట్రలను పకడ్బందీగా అమలు చేసేందుకు ధరణి అనే చట్టంతో నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు, ఇందిరమ్మ సంక్షేమ పాలనతో అందించిన భూములను తిరిగి బలవంతంగా ప్రభుత్వం గుంజుకొంటోంది.ఈ దుర్మార్గ పాలనను ప్రజలకు వివరించేందుకు, ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకూ 1500కు పైగా కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేస్తూ ప్రజలను చైతన్య వంతం చేస్తున్నారని అన్నారు. నాటి నిజాం కాలపు రజాకర్లమీద జరిగిన సాయుధ తెలంగాణ పోరాటం, తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమాలు వచ్చింది.. భూమి కోసం,. భుక్తి కోసం.. విముక్తి కోసమే. దున్నేవాడిదే భూమి అంటూ జెండా ఎత్తి ఆత్మగౌరవంతో జీవించే అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ నేడు కుట్రపూరింతగా మళ్లీ నాటి ఫ్యూడల్ బానిసత్వపు, వెట్టి చాకిరలోకి తోసేస్తున్నాడు.. దీనిపై భట్టి విక్రమార్క అటు శాసనసభలోనూ, బయటా ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇప్పుడు పాదయాత్రతో ప్రజల మధ్య తిరుగుతూ.. ప్రజల్ని ఉత్తేజితుల్ని… చేస్తూ కార్యోన్ముఖుల్ని చేస్తున్నారని అన్నారు.
ఇది కూడా చదవండి: పంచాయతీ కార్యదర్శులకు అండగా ఉంటాం: కాంగ్రెస్
రైతులు, నిరుద్యోగులు, కార్మికులు, సింగరేణి కార్మికులు, కుల వృత్తులు చేసే వారు అన్ని రంగాల వారిని కలుస్తూ వారి సమస్యలను వింటూ వాటిపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ముందుకు సాగుతున్నారు భట్టి విక్రమార్క అని అన్నారు. అంతే కాకుండా ఈ నెల 8 న నిరుద్యోగ నిరసన సభకు ప్రియాంక గాంధీ పాల్గొనున్నారని అదే రోజు భట్టి విక్రమార్క యాత్ర సరూర్ నగర్ చేరుకుంటుందని అక్కడ జరిగే బహిరంగ సభలో నిరుద్యోగులు, కార్మికులు, రైతులు, మానవతావాదులు, అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.
== అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలి
ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండి పడ్డారు. ఆరు నెలలుగా అకాల వర్షాలు కురుస్తుంటే ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలం అయిందని అన్నారు. వెంటనే మార్క్ ఫెడ్ లు ప్రారంభించి రైతుల దగ్గర ధ్యానం కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తేమ తరుగు పేరుతో రైతులను ఇబ్బందులు పెట్టకుండా బాధిత రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ ఆధ్యర్యంలో రైతుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: ఔటర్ రింగ్‌రోడ్డులో భారీకుంభకోణం: రేవంత్ రెడ్డి
ఈ కార్యక్రమంలో 2 వ డివిజన్ కార్పొరేటర్ మలిదు వెంకటేశ్వర్లు, లకవాత్ సైదులు పల్లెబోయిన చంద్రం, మాజీ కౌన్సిలర్ పాలకుర్తి నాగేశ్వరరావు,మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు ముజహిద్ హుస్సేన్, ఎస్టీ సెల్ నగర అధ్యక్షుడు దేవత్ శంకర్ నాయక్, సేవా దల్ నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్,బీసీ సెల్ నగర అధ్యక్షుడు బాణాల లక్ష్మణ్, డివిజన్ అధ్యక్షులు ఏసబోయిన శ్రీశైలం, మహమూద్, షేక్ వసీం,పర్వత శ్రీను, భీమ రెడ్డి రమేష్, దాసరి పూర్ణ చంద్,బోబుర్ నరేంద్ర,రిచింతల ఉపేందర్, షేక్ జాహిర్, పాష, గడ్డం వెంకటయ్య, చలపతి,కళంగి కనకరాజు, గాదరి బాబు, రంజాన్, అబ్దుల్ అహద్,రఘునాథ పాలెం మండల అధ్యక్షుడు భూక్యా బాలాజీ, కొంటెముక్కుల నాగేశ్వరరావు, మారం కరుణాకర్ రెడ్డి,మాజీ సర్పంచ్ రెంటాల ప్రసాద్, బొడ తావుర్య నాయక్,మాజీ సర్పంచ్ రేమల్లే రమేష్, ఆలస్యం సూరయ్య, ఇర్జల కృష్ణ, తది తరులు పాల్గొన్నారు.