Telugu News

కాంగ్రెస్ లో చేరిన పాలేరు నియోజకవర్గ నేత ఎవరు..?

కండువ కప్పి స్వాగతం పలికిన ఏఐసీసీ నాయకుడు మల్లిఖార్జున ఖర్గే

0

 హస్తం పార్టీలో చేరిన బత్తుల సోమయ్య

== ఢిల్లీలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిక

== కండువ కప్పి స్వాగతం పలికిన ఏఐసీసీ నాయకుడు మల్లిఖార్జున ఖర్గే

(పెండ్ర అంజయ్య)

ఖమ్మంప్రతినిధి, ఆగస్టు 5(విజయంన్యూస్)

తెలంగాణ సాధన పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఇంటి పార్టీ తన కార్యకర్తలతో కాంగ్రెస్ లో విలీనం అయిన చారిత్రక సందర్భం ఇది. ఒక వైపు కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దపెద్ద బడా నాయకులు రాజీనామా చేసి బీజేపీలో చేరుతుండగా, అదే వేగంగా అత్యంత కీలకమైన వ్యక్తులు, తెలంగాణ ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అందులో భాగంగానే ఇంటిపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఉద్యమకారుడు బత్తుల సోమయ్య శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అత్యంత రహస్యంగా ఇంటిపార్టీ అధినేత చెరుకుసుధాకర్ తో కలిసి  పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో ఏఐసీసీ నాయకులు, మాజీ లోక్ సభ పక్షనేత మల్లిఖార్జున్ ఖర్గే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతే కాదు ‘ఇంటి పార్టీ’ని విలీనం చేశారు.

allso read- కాంగ్రెస్ లో చేరిన ‘పాలేరు’ ఉద్యమనేత

బత్తుల సోమయ్య 2002లో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ 2016 ఎన్నికల వరకు టీఆర్ఎస్ పార్టీ పాలేరు నియోజకవర్గ ఇన్ చార్జ్ గా పనిచేశారు. ఆ తరువాత మంత్రిగా వచ్చిన తుమ్మల నాగేశ్వరరావు ఉధ్యమకారుల పట్ల చిన్నచూపు చూడటంతో ఆయన అసంతప్తి వ్యక్తం చేస్తూ ప్రోఫెసర్ కోదండరామ్ పెట్టిన తెలంగాణ జనసమితి పార్టీలో చేరారు. ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన ఆ తరువాత ఎమ్మెల్సీ ఎన్నికల ముందు  చెరుకుసుధాకర్ తో కలిసి ‘ఇంటిపార్టీ’ని స్థాపించి, ఆ తరువాత ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలబడిన చెరుకు సుధాకర్ కు పూర్తి స్థాయిలో పనిచేశారు. అనంతరం ఇద్దరు కలిసి అత్యంత వేగవంతంగా మారుతున్న రాజకీయాల్లో భాగంగా శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.  ఈ సందర్బంగా ఇంటి పార్టీ రాష్ట్ర కార్యదర్శి బత్తుల సోమయ్య మాట్లాడుతూ. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, భవిష్యత్ లో తెలంగాణ ను కాపాడబోయేది కూడా కాంగ్రెస్ పార్టీ అనే బలమైన నమ్మక్సంతో కాంగ్రెసుతో మమేకం అయ్యామని తెలిపారు. చాలా సంతోషంగా ఉందని, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రుణం తీర్చుకునే అవకాశం నాకు వచ్చిందని ఆయన అన్నారు. యువకులు, మేథావులు ఆలోచించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణను దోచుకున్న పార్టీ, బీజేపీ తెలంగాణను దేశానికి బలిచ్చే పార్టీ అని బత్తుల సోమయ్య పేర్కొన్నారు. ఎవరు ఏ పార్టీకి మద్దతు తెలపాలనేది మీరు నిర్ణయించుకోవాలని సూచించారు.