Telugu News

ఓట్ల కోసమే కాంగ్రెస్ వాగ్దానాలు: నామా 

రైతన్నలకు అండగా నిలిచిన ఏకైక నాయకుడు కేసీఆర్

0

ఓట్ల కోసమే కాంగ్రెస్ వాగ్దానాలు: నామా 

– రైతన్నలకు అండగా నిలిచిన ఏకైక నాయకుడు కేసీఆర్

– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్ల రైతాంగానికి నష్టం

– ప్రతి పంటకు MSP చట్టం చేయాలని పార్లమెంట్ లో డిమాండ్ చేశాం

– ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది

– రైతు వెంట నిలిచిన కేసీఆర్ కి మద్దతుగా పార్లమెంట్ ఎన్నికల్లో బీ.ఆర్.యస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి

– తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీలో కాపాడేది బీ.ఆర్.యస్ పార్టీ మాత్రమే

ఖమ్మం, 22 ఏప్రిల్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్ల తెలంగాణ రైతాంగం నష్టపోతుందని బీ.ఆర్.యస్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ ఎంపీ అభ్యర్ది నామ నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం నాడు ఉదయం ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ను సందర్శించిన ఆయన అక్కడ ఉన్న రైతులు, హమలీలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ఇది కూడా చదవండి:- కాంగ్రెస్ ను వెంటాడి.. వేటాడుతాం: నామా

అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన కరువు తో సాగునీరు, తాగునీరు లేక రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్రంలో సాగునీరు అందకపోవడం వల్ల వరి పంట ఎండిపోయి రైతాంగం దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారన్నారు వెంటనే పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంట సాగు చేయడానికి బాగా ఖర్చు వచ్చిందని దిగుబడి తగ్గిందని రైతులు తనతో మాట్లాడుతూ చెప్పారని అయితే రైతాంగ సమస్యల పై పార్లమెంట్ లో మాట్లాడినప్పుడు. ఎన్నోసార్లు ఎంఎస్పీ (మినిమం సపోర్ట్ ప్రైస్) అమలు చేయాలని దానికి ప్రత్యేక చట్టం చేయాలని కోరిన కేంద్రం స్పందించలేదన్నారు. స్వామినాథన్ ఇచ్చిన సూచనలు అమలు చేయాలన్న స్పందన లేదన్నారు.

ఇది కూడా చదవండి:- కార్యకర్తలకు అండగా ఉంటా : నామ నాగేశ్వరరావు

ఓట్ల రాజకీయం కోసమే కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు చేస్తుందని రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, పెన్సన్లు పెంచి ఇస్తామన్న హామీలు ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆ విషయాని ప్రజలు తెలుసుకొని మరల కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని తెలిపారు. పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం గొంతెత్తి మాట్లాడేది ఒక్క బీ.ఆర్.యస్ పార్టీ ఎంపీలే అన్నారు అందుకే బీ.ఆర్.యస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ లో ఉండాలిసిన అవసరం ఉందన్నారు రైతాంగానికి పెద్దపేట వేసిన కేసీఆర్ కు మద్దతుగా కారు గుర్తు పై ఓటేసి బీ.ఆర్.యస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం లో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దోరేపల్లి శ్వేత, మాటేటి నాగేశ్వరరావు, చిన్ని కృష్ణారావు, సతీష్, నరేష్, మెంతుల శ్రీశైలం, కోలేటి నవీన్, గునుగుంట్ల వాసు
తాళ్లూరి శ్రీనివాస్, చీకటి రాంబాబు, కృష్ణప్రసాద్ తదితరులు ఉన్నారు