పెనుబల్లిలో కాంగ్రెస్ షాక్
బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య
పెనుబల్లిలో కాంగ్రెస్ షాక్
== బీఆర్ఎస్ లో చేరిన పది కుటుంబాలు
== బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య
(పెనుబల్లి/సత్తుపల్లి-విజయంన్యూస్)
పెనుబల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీకి కొందరు నాయకులు షాక్ ఇచ్చారు. పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజర్ గ్రామానికి చెందిన 10 కుటుంబాలు కాంగ్రెస్ కార్యకర్తలు బి.ఆర్.యస్ పార్టీలో చేరగా వారికి సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోని ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై సండ్ర వెంకట వీరయ్య తో అభివృద్ధి సాధ్యమని వారు గ్రహించి సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి:- నువ్వా..నేనా..? కొత్తగూడెం ఎమ్మెల్యే ఎవరు..?
ఈ కార్యక్రమంలో మండల బి.ఆర్.యస్ పార్టీ అధ్యక్షులు కనగాల వెంకటరావు, ఎంపీపీ లక్కినేని అలేఖ్య వినీల్, దేవాలయ చైర్మన్ పసుమర్తి వెంకటేశ్వరరావు, కనగాల సురేష్, మందడపు అశోక్, చెక్కిలాల లక్ష్మణరావు, వంగ నిరంజన్ గౌడ్, భూక్యా ప్రసాద్, కోట ప్రభాకర్, కోట ప్రసాద్, మరీదు చంద్రశేఖర్ , గ్రామ శాఖ అధ్యక్షులు మరకలా చంటి, యలమర్తి శ్రీనివాసరావు, యలమర్తి రాంబాబు, కోమటి వెంకటేశ్వరరావు, తడికమళ్ళ జయరావు, మారకాల వెంకటేశ్వరరావు, పరిగడపు రాములు, మారకాల రాంబాబు, సింగిసలా కృష్ణ, కొలికపోగు వెంకటేశ్వరరావు, తుంగ వెంకటేశ్వరరావు తదితరులున్నారు.