Telugu News

*ఉపాధి కల్పనే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు:జావిద్

పుటాని తండాలో 20 కుటుంబాలు కాంగ్రెస్లో చేరిక*

0

*ఉపాధి కల్పనే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు:జావిద్
*👉🏻యూత్ డిక్లరేషన్ ఖచ్చితంగా అమలు*
*👉🏻నిరుద్యోగులకు అండగా నిలవాలనే తపన*
*👉🏻జూన్ 2న రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ పోటీలు*
*👉🏻పుటాని తండాలో 20 కుటుంబాలు కాంగ్రెస్లో చేరిక*
*👉🏻పీసీసీ సభ్యులు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్*

(ఖమ్మం అర్బన్-విజయం న్యూస్)

నిరుద్యోగులకు ఉపాధి కల్పనే కాంగ్రెస్ కార్యాచరణ ఉండబోతుందని పిసిసి సభ్యులు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ అన్నారు.

ఇది కూడా చదవండి:- మహిళా, యువత శక్తి ఏకం అవ్వాలి: జావిద్

హాత్ సే హత్ జోడో అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రఘునాథపాలెం మండలంలో పంగిడి, పుటానితండా లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హనుమకొండ జిల్లాలో రాహుల్ గాంధీ ప్రవేశపెట్టిన రైతు డిక్లరేషన్ను, సరూర్ నగర్ లో ప్రియాంక గాంధీ ప్రవేశపెట్టిన యూత్ డిక్లరేషన్ ను ప్రజలకు వివరించారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు టిపిసిసి ఆధ్వర్యంలో తెలంగాణ యువశక్తిని మేల్కొల్పడమే లక్ష్యంగా జూన్ రెండో తేదీన రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.

ఇది కూడా చదవండి:-  కాంగ్రెస్ పార్టీ లక్ష్య సాధకడు విక్రమార్కుడు: జావిద్

ఆసక్తిగల అభ్యర్థులు జూన్ ఒకటవ తేదీ వరకు 7661899899 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి తమ పేరును నమోదు చేసుకోవచ్చని తెలిపారు. క్విజ్ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. దేశంలో రానున్నది మంచి రోజులే అని ప్రజలు అధైర్య పడవద్దు అని అన్నారు. గాంధీ సిద్ధాంతాలను తన రక్తంలో ఇంకించుకున్న రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడడం మనందరి బాధ్యత అని కచ్చితంగా రాహుల్ గాంధీని ప్రధాని పీఠంపై ఎక్కించి ప్రజాస్వామ్య బద్ద పాలనకు కృషి చేద్దామని అన్నారు. తెలంగాణలో నయా నిజాం దొరను తరిమి కొట్టి సోనియమ్మ కలలు గాన్న బంగారు తెలంగాణను నిర్మించుకుందామని అన్నారు. ప్రతి ఒక్కరూ కెసిఆర్ చేసిన నయా మోసాలను పసిగట్టాలని గుర్తు చేశారు.

ఇది కూడా చదవండి:- కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డం త‌థ్యం: జావిద్

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా మనపై ఉందని అన్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావిద్ ఆధ్వర్యంలో పుటాని తండలో 20 కుటుంబాలు కాంగ్రెస్లో చేరాయి. ఈ కార్యక్రమంలో పసుపులేటి దేవేందర్, రఘునాథ పాలెం మండల అధ్యక్షుడు భూక్యా బాలాజీ , మారం కరుణాకర్ రెడ్డి , కొంటె ముక్కుల నాగేశ్వరావు , ఏలూరి రవికుమార్ , మహమూద్ , పంగిడి గ్రామ నాయకులు రఘునాథ పాలెం మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడు రజాబెల్లి , హరిసింగ్ , వంశీ సుమన్, మల్సూర్, వెంకన్న, మాచర్ల రవి, మునా, శంకర్ పూటని తండా గ్రామం గుగులోత్ అనిల్ కుమార్ గారు, సుమన్, మోహన్ వసీం, యశ్వంత్, సాగర్, నాని, తది తరులు పాల్గొన్నారు

ఇది కూడా చదవండి:- మంత్రిగారు దమ్ముంటే నాపై అవిశ్వాసం పెట్టు: కనకయ్య