ఖమ్మంలో కాంగ్రెస్ కార్పొరేటర్లపై చిన్న చూపేందుకు ?
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్
ఖమ్మంలో కాంగ్రెస్ కార్పొరేటర్లపై చిన్న చూపేందుకు ?
== స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కేటాయింపులో తీవ్ర అన్యాయం
== ప్రతి పక్షాల డివిజన్ లో ప్రజల ఓట్లు అడగరా !
== అభివృద్ధి అంటే అధికార పార్టీ డివిజన్లేనా..?
== జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
ప్రతి పక్ష కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవ రెడ్డి భవనంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 50 కోట్ల రూపాయలను విడుదల చేసిందని అన్నారు. ఆ ఫండ్ కార్పొరేషన్ పరిధిలో డివిజన్ల అభివృద్ధికి ఉపయోగించాల్సి ఉందని అందుకు అనుగుణంగా డివిజన్ కార్పొరేటర్ల సమక్షంలో ఆయా డివిజన్ కార్పొరేటర్ల కు నిధులు పంపిణి చేయాల్సి ఉందని అన్నారు.
ఇది కూడా చదవండి: భట్టి పాదయాత్ర కు సై
కానీ స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్పొరేటర్ల డివిజన్ లకు, ఇండిపెండెంట్ కార్పొరేటర్ల డివిజన్ లకు నిధులు కేటాయించకుండా తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. అభివృద్ధి అంటే అధికార పార్టీ కార్పొరేటర్ల డివిజన్లు మాత్రమే కాదని అన్ని డివిజన్లు అభివృద్ధి చెందినప్పుడే అసలైన అభివృద్ధి అని అన్నారు. కార్పొరేషన్ అభివృద్ధికి ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించిన దాన్ని అన్ని డివిజన్లకు సమానంగా పంచాలని విజ్ఞత లేదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులపై చిన్నచూపు చూస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అభివృద్ధి అనేది పార్టీలకతీతంగా ఉండలే తప్పా డివిజన్ కార్పొరేటర్లు అధికార పార్టీ వార కదా అని చూడ కూడదనే సోయి మంత్రి కి లేదా అని విమర్శించారు. ఇప్పుడు నిధులు కేటాయించకుండా రేపు ఆ డివిజన్ లో ఓట్లు ఏ మొఖం పెట్టుకొని అడుగుతారో మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిధులు మంజూరులో ఇప్పటికైనా తీరు మార్చుకొక పోతే కార్పొరేషన్ ముందు కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. అనంతరం 27వ డివిజన్ కార్పొరేటర్ మిక్కిలినేని మంజులనరేంద్ర మాట్లాడుతూ… మంత్రి ఖమ్మం నియోజవర్గానికి ఎమ్మెల్యే నా లేకపోతే అధికార పార్టీ డివిజన్లకే ఎమ్మెల్యే ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఏద్దేవా చేశారు. మేము కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డ వారిమేనని ఏ పాపం చేసామని ప్రతిపక్షాల డివిజన్లకు ప్రభుత్వ నిధులు కేటాయించడం లేదని విమర్శించారు. మా డివిజన్ ప్రజల అగ్రహానికి గురికాకముందే ప్రతిపక్షాల డివిజన్లకు వెంటనే నిధులు కేటాయించాలని లేదంటే వారి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
ఇదికూడా చదవండి: ఏకకాలంలో 2 లక్షలు రైతు రుణమాఫీ: రాయల
అనంతరం కార్పొరేటర్ దుద్దూకురి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలకు ప్రతి పక్ష పార్టీ కార్పొరేటర్ లను ఆహ్వానించకపోవడం రాజ్యాంగాన్ని ఖూనీ చేయడమే అని అన్నారు. విలీన గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని అన్నారు. ప్రభుత్వా అన్యాయాలను కరపత్రాల రూపంలో ప్రజలకు చేరవేస్తూ అక్రమాలను బయటపెడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో విరితోపాటు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య,జిల్లా మైనారిటీ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్,కార్పొరేటర్లు పల్లెబోయిన భారతీచంద్రం,ముస్తఫారఫీదా బేగం,కోప్పెర సరితఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.