*కాంగ్రెస్ నిరుద్యోగ డిక్లరేషన్*
== హామిల వర్షం కురిపించిన ప్రియాంక గాంధీ
== చదివి వినిపించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
(సరూర్ నగర్-విజయంన్యూస్)
కాంగ్రెస్ యువ నిరుద్యోగ డిక్లరేషన్ ను ప్రకటించింది. తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూనే హామిల వర్షం కురిపించింది. హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో జరిగిన నిరుద్యోగ డిక్లరేషన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటించారు. ఆ డ్లికరేషన్ ను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చదవి వినిపించారు. ఆ డిక్లరేషన్ అంశాలు ఇవే
== తెలంగాణ పోరాట ఉద్యమకారులను తెలంగాణ సమరయోదులుగా గుర్తింపు
== తెలంగాణ ఉద్యమ అమరవీరుల కుటుంబానికి ఉద్యోగం.. నెలకు రూ.25వేల పెన్షన్ సౌకర్యం
== ఉమ్మడి జిల్లాకో ఐఐటీ
== అధికారం వచ్చిన మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాల భర్తికి నోటిఫికేషన్
== ఎస్సీ, స్టీ, బీసీ మైనార్టీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తి
== ప్రతి ఏఢాది జూన్ 2 నాటికి క్యాలెండర్ విడుదల..నోటిఫికేషన్.. సెప్టెంబర్ 17 నాటికి ఖాళీ భర్తి ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేత
== నిరుద్యోగులకు నిరుద్యోగ భతి
== అన్ లైన్ రిజిస్ట్రేషన్.. పారదర్శకంగా నియామకల పూర్తి
== ఉద్యోగులకు శిక్షణ తరగతులు.. అవినీతి రహిత పాలన అందించేందుకు క్రుషి
== ప్రైవేట్ కంపెనీల్లో 75శాతం తెలంగాణ బిడ్డలకే ఇచ్చేందుకు జీవో జారీ చేస్తాం
== గల్ప్ ఉధ్యోగులు, కార్మికులను అదుకునేందుకు ప్రత్యేక చట్టం చేస్తాం
== ఎస్సీ, బీసీ కమీషన్ తరహాలోనే యువత కమీషన్ ఏర్పాటు చేస్తాం
== ప్రత్యేక యూనివర్సీటీలను ఏర్పాటు చేస్తాం.
== విద్యార్థునులకు ఎలక్రికల్ స్కూటీలను అందజేస్తాం