Telugu News

వారంటీ లేని కాంగ్రెస్ ను తరమికొట్టాలే: కేటీఆర్

ఖమ్మం పర్యటనలో కాంగ్రెస్ పై మండిపడిన మంత్రి కేటీఆర్

0

వారంటీ లేని కాంగ్రెస్ ను తరమికొట్టాలే: కేటీఆర్

== వచ్చే ఎన్నికలలో ప్రతిపక్షాలను పుడ్ బాల్ ఆడుకోవాలి..

== ఆరు దశాబ్దాలు అధికారం ఇస్తే కనీసం కరెంట్ కూడా ఇవ్వలేకపోయారు..

== ఖమ్మం పర్యటనలో కాంగ్రెస్ పై మండిపడిన మంత్రి కేటీఆర్

(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)

వారంటీ లేని కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో లేకుండా తరమికొట్టాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం ఖమ్మం నగరంలో పర్యటించిన ఆయన పలు  అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రులు కేటీ.రామారావు, రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  శంకుస్థాపన చేశారు. ఖమ్మం మున్నేరు వద్ద నూతనంగా నిర్మాణం చేసిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ మాట్లాడారు. పసలేని పథకాలను చెబుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలు చేస్తున్న ప్రతిపక్షాలను వచ్చే ఎన్నికలలో పుడ్ బాల్ ఆడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వాళ్లకు  ఆరు దశాబ్దాలు అధికారం ఇస్తే కనీసం కరెంట్ కూడా ఇవ్వలేకపోయారని, దేశంలోనే 24గంటల కరెంట్ రైతులకు ఉచితంగా అందిస్తున్న ఏకైకప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని అన్నారు.

ఇది కూడా చదవండి: మాకు రాముడైన, కృష్ణుడైన ఎన్టీఆర్ : కేటీఆర్

కాంగ్రెస్ పార్టీకే వారంటీ లేదని, అలాంటి పార్టీ వారంటి లేని పార్టీ గ్యారంటీ పథకాలు ఇస్తే ప్రజలు నమ్ముతారా..? అని ప్రశ్నించారు. 24గంటలు నిరంతరం మంచినీళ్ళు అందించే కార్పోరేషన్ ఖమ్మం కావాలని కొనియాడారు. ఖమ్మం నియోజకవర్గంలో గతంలో 4వందల కిలో మీటర్లు ఉండగా ప్రస్తుతం వెయ్యి కిలో మీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.. 1370 కోట్ల రూపాయలతో ఖమ్మంలో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆరిపోయేదీపం, సచ్చిపోయిన పార్టీ అని, ఆ పార్టీని ప్రజలు ఆదరించొద్దన్నారు. కర్నాటక కాంగ్రెస్ నుండి తెలంగాణకు వందల కోట్ల రూపాయలు వస్తున్నాయి.. డబ్బులు తీసుకుని అభివృద్ధికి ఓటు వేయాలన్నారు. ఎన్టీఆర్ శిశ్యుడు కేసీఆర్ అని, మూడోసారి కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కాబోతున్నారని జోస్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎంపీలు నామా నాగేశ్వర రావు, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, కలెక్టర్ వీపీ గౌతమ్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, ఏఎంసీ చైర్మన్ దోరేపల్లి శ్వేత, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ గెలుపే అభివద్దికి మలుపు: మంత్రి కేటీఆర్