Telugu News

విజయభేరి సభను జయప్రదం చేయండి: రాయల

ముఖ్యకార్యకర్తల సమావేశంలో పీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు

0

విజయభేరి సభను జయప్రదం చేయండి: రాయల

== నిరుపేదలు, దళితగిరిజనులు సభకు భారీగా తరలిరావాలి

== ముఖ్యకార్యకర్తల సమావేశంలో పీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు

(ముదిగొండ/కూసుమంచి-విజయంన్యూస్)

హైదరాబాద్ లో రేపు జరగనున్న కాంగ్రెస్ జయభేరి సభను విజయవంతం చేయాలని టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ముదిగొండ మండలం వెంకటాపురం లోని రాయల పంక్షన్ హాల్ లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల తో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రాజదానిలో కాంగ్రెస్ పార్టీ అత్యంత ముఖ్యమైన, ప్రజ ప్రయోజనార్థం ఉపయోగపడే పథకాల అమలు నిర్ణయం తీసుకునే సీడబ్ల్యూసీ సమావేశం హైదరాబాద్ లో జరుగుతుందని, ఈ సమావేశం తెలంగాణలో జరగడం చాలా సంతోకరమన్నారు. దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, కార్పోరేట్ శక్తులకు దేశ సంపదను అంటిబెట్టే అంశంపై సీడబ్ల్యూసీలో చర్చించనున్నారని తెలిపారు.

ఇది కూడా చదవండి: నేడు హైదరాబాద్ కు సోనియా, రాహుల్ గాంధీ 

భారతదేశ ప్రజలకు ఏ  రకమైన అవసరాలు ఉన్నాయి, పేద ప్రజలకు ఎలాంటి సంక్షేమాభివద్ది పథకాలు అవసరం అనే విషయాలపై చర్చించనున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అవలంభిస్తున్న దొరల పాలన వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, ఆ ప్రభుత్వాన్ని ఓడించేందుకు కావాల్సిన చర్యలు తీసుకునేందుకు అత్యంత కీలక నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. అంతే కాకుండా ఐదు గ్యారంటీ స్కీమ్ లను సీడబ్ల్యూసీ సమావేశంలో తీర్మాణం చేసి, వాటిని ప్రకటిస్తారని తెలిపారు. అలాగే ఈనెల 17న హైదరాబాద్ లోని మహేశ్వరం నియోజకవర్గంలో ని తుక్కుగూడ లో విజయభేరి పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నది.. ఈ సభకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ తో పాటు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారని తెలిపారు. ఈ సభలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేసే ఐదు పథకాలు ప్రకటించనున్న కాంగ్రెస్ అగ్రనేతలు, వాటి అమలు తీరును వివరిస్తారని అన్నారు.

ఇది కూడా చదవండి: విజయభేరితో  ఎన్నికల కదనభేరి : కాంగ్రెస్

అందుకే ప్రజాప్రయోజనంతో కూడిన అద్భుతమైన ఐదు గ్యారంటీ స్కీమ్ లను ప్రకటించబోతున్న తరుణంలో తెలంగాణ తల్లి వచ్చే విజయభేరి సభకు ఖమ్మం జిల్లా నుంచి పాలేరు నియోజకవర్గం నుంచి భారీగా జనం తరలిరావాలని కోరారు. సభను విజయవంతం చేసేందుకు పాలేరు నియోజకవర్గం నుంచి వేలాదిమంది కాంగ్రెస్ కార్యకర్తలు తరలిరావాలని, ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈసభ ద్వారానే కాంగ్రెస్ ఎన్నికల  ప్రచారం ప్రారంభం కానుందన్నారు. సభకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నామన్నారు.

== పార్టీని రక్షించిన వారికి టిక్కెట్ ఇవ్వాలి: నేతలు

పదేళ్ల పాటు అధికారం లేకపోయినప్పటికి పార్టీ, పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టకాలంలో ఉన్న సమయంలో గత పదేళ్ల నుంచి పార్టీని అంటిబెట్టుకుని నాయకత్వం చేస్తూ, బోలేడంతా ఖర్చులు పెట్టుకుని కష్టనష్టమైనా పార్టీని నడిపించిన వారికి పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ పాలేరు నియోజకవర్గ నాయకులు కోరారు. పార్టీలోకి నూతనంగా వస్తున్నవారికి కచ్చితంగా ఆహ్వానిస్తామని, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను కూడా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. అయితే పార్టీని కాపాడిన వారికి, కష్టకాలంలో కార్యకర్తలకు అండగా ఉన్నవారికి పార్టీ అధిష్టానం అన్యాయం చేయదనే నమ్మకం ఉందన్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పార్టీ  టిక్కెట్ ఇస్తే కార్యకర్తల్లో అసహానం వస్తుందని, కష్టపడేవారికి పార్టీ గుర్తింపు ఇవ్వడం లేదనే అపనమ్మకం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే కాంగ్రెస్ అదిష్టానం ఆలోచించి పార్టీ కోసం కష్టపడుతున్న రాయల నాగేశ్వరరావుకు టిక్కెట్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాలేరు, మధిర నియోజకవర్గం నుంచి భారీగా జనం తరలివచ్చారు.

ఇది కూడా చదవండి: టీడీపీ అభ్యర్థులుగా జనసేన పార్టీ నేతల పోటీ