Telugu News

నియోజకవర్గ యూత్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన గొల్లపల్లి నరేష్ కుమార్

అభినందనలు తెలుపుతున్న యూత్ నాయకులు.

0

నియోజకవర్గ యూత్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన గొల్లపల్లి నరేష్ కుమార్

** అభినందనలు తెలుపుతున్న యూత్ నాయకులు.

(మణుగూరు -విజయం న్యూస్)

పినపాక నియోజకవర్గం వ్యాప్తంగా వివిధ రాజకీయ కుల సంఘాలకు అతీతంగా పినపాక నియోజకవర్గం మాదిగల ఐక్యత వేదిక కమిటీని ఏర్పాటు చేయగా *పినపాక నియోజకవర్గం యూత్ అధ్యక్షుడిగా గొల్లపల్లి నరేష్ కుమార్* ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా *పినపాక నియోజకవర్గం అధ్యక్షుడు రావులపల్లి రామ్మూర్తి* గారికి కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ పినపాక నియోజకవర్గం ఐక్యత కార్యక్రమాన్ని తమ ఆలోచనలతో ముందుండి నడిపిస్తున్న పొడుతూరి ప్రసాద్ నల్లగట్ల రఘు గారిని ప్రశంసిస్తూ.ఈ సందర్భంగా గొల్లపల్లి నరేష్ కుమార్ మాట్లాడుతూ… *పినపాక నియోజకవర్గంలో మాదిగల ఐక్యతలను చేయాలనే తమ ఆలోచనలతో ముందుండి నడిపిస్తున్న పొడుతూరి ప్రసాద్, నల్లగట్ల రఘు* ని ప్రశంసిస్తూ పినపాక నియోజకవర్గం మాదిగ సోదరులు ఎంతో ఐక్యతతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అయిన తర్వాత తొలిసారిగా పినపాక నియోజకవర్గం స్థాయి మాదిగల సమావేశం నిర్వహించడం మన జాతి ఐక్యతకు నిదర్శనమని పార్టీలు ఏదైనా సంఘం ఏదైనా అందరూ కలిసికట్టుగా మాదిగలకు జరుగుతున్న అన్యాయాలపై అరాచకాలపై మనమందరం కలిసికట్టుగా పోరాడాలని పినపాక నియోజకవర్గం మొదలైన ఈ ఐక్యత 119 నియోజకవర్గాల్లో విస్తరింపజేయాలని నియోజకవర్గంలో తనను నమ్మి ఈ బాధ్యత చెప్పిన కమిటీ సభ్యులకు నియోజకవర్గంలో నాకు ఇచ్చిన ఈ బాధ్యతను గ్రామాల వారిగా మండలం వారిగా కమిటీలు వేసి మాదిగ జాతి కోసం తన సాయిశక్తుల కృషి చేస్తానని తెలియజేశారు