Telugu News

అభివృద్ధికి సహకరించాలి : – ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..

పల్లారుగూడ,మొండ్రాయి గ్రామాలలో పర్యటన...

0

అభివృద్ధికి సహకరించాలి : – ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..

పల్లారుగూడ,మొండ్రాయి గ్రామాలలో పర్యటన…

(వరంగల్  – విజయంన్యూస్)

సంగెం మండలంలోని మొoడ్రాయి,పల్లారుగూడ గ్రామాలలో పర్యటించిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

పర్యటనలో భాగంగా గ్రామాలలో పారిశుద్ధ్య పనులు, పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులను పరిశీలించారు.

నూతనంగా రోడ్డు విస్తరణలో భాగంగా ఇండ్లు కోల్పోతున్న బాధితులను ఇంటికి వెళ్లి వారితో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన గ్రామసభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ..

-గ్రామాల అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని కోరుతున్న.
-ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుంది.
-ప్రజాభిప్రాయ సేకరణతో రోడ్డు విస్తరణ పనులు చేపడతాం.
-రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోతున్న వారందరికీ ప్రభుత్వం ద్వారా డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తాం.
-అందరూ సహకరిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది.
-మారుతున్న సమాజానికి అనుగుణంగా గ్రామ అభివృద్ధిలో మార్పులు చేసుకోవాలి.
-నియోజకవర్గంలో రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన 182 కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేసి నిర్మించడం జరిగింది.

ఇంకా కొన్ని ఇండ్లు మంజూరుకు సిద్ధంగా ఉన్నాయి.
-ఆత్మకూరు,అక్కంపేట,నీరుకుళ్ల, పెంచికలపేట గ్రామాలను చూసిరావాలని ప్రజలను కోరారు.
-ఇండ్లు కోల్పోతున్న వారి జాబితా వెంటనే సిద్ధం చేసివ్వాలని తహశీల్దార్, ఆర్&బి అధికారులకు ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మండల,గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు, రెవెన్యూ,ఆర్&బి అధికారులు,తెరాస మండల,గ్రామ నాయకులు తదితరులు పాల్గోన్నారు.

 

 

also read :- మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి కరోనా

also read :-అభివృద్ధికి సహకరించాలి : – ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..