కూసుమంచి మండల పరిషత్ లో కరోనా కలకలం
%% ఎంపీడీవో కార్యాలయంలో ముగ్గురు ఉద్యోగులకు కరోనా
%% తక్షణమే స్పందించిన ఎంపీడీవో.. ఆపీస్ మొత్తం శానిటైజేషన్
(కూసుమంచి-విజయంన్యూస్)
కరోనా మహమ్మారి ప్రభుత్వ ఉద్యోగుల వెంటపడుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కూసుమంచి వ్యవసాయశాఖలో చోరబడిన కరోనా వైరస్ ఇప్పుడు కూసుమంచి మండల పరిషత్ కార్యాలయంలో చొరబడినట్లు తెలుస్తోంది. కార్యాలయంలో పనిచేసే సిబ్బందితో పాటు పంచాయతీ కార్యాదర్శులకు కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. కూసుమంచి వ్యవసాయశాఖశాఖ కార్యాలయంలో నలుగురు ఏఈవోలకు కరోనా పాజిటీవ్ రాగా, ఇప్పుడు కూసుమంచి మండల పరిషత్ కార్యాలయంలో ముగ్గురికి కరోనా వచ్చినట్లు సమాచారం.
also read :-వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే : రేవంత్ రెడ్డి
దీంతో సమాచారం తెలుసుకున్న తోటి ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు. నిత్యం కలిసి ఉండే వారికి కరోనా రావడంతో ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులు టెస్టులు చేసుకునేందుకు ప్రభుత్వాసుపత్రికి వెళ్తున్నారు. వారితో తిరిగిన వారు, మాట్లాడిన తోటి ఉద్యోగులు టెస్టులు చేయించుకుంటున్నారు. కాగా సమాచారం అందుకున్న కూసుమంచి ఎంపీడీవో కరుణాకర్ రెడ్డి తక్షణమే మండల పరిషత్ కార్యాలయాన్ని శానిటైజేషన్ చేయించారు. మండల పరిషత్ కార్యాలయంలోని అన్ని గదులను శానిటైజేషన్ చేయించడంతో పాటు పరిసర ప్రాంతాన్ని కూడా శానిటైజేషన్ చేయించారు.