Telugu News

కరోనా నియంత్రణకు సర్వం సిద్దం

ప్రజలందరు తప్పక జాగ్రత్తలు పాటించాలి

0

కరోనా నియంత్రణకు సర్వం సిద్దం
 ప్రజలందరు తప్పక జాగ్రత్తలు పాటించాలి
 ప్రంట్ వారియర్స్అందరు బూస్టర్ డోస్ లు తప్పకుండా వేసుకోవాలి
 మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
 బూస్టర్ డోస్ లను ప్రారంభించిన మంత్రి, కలెక్టర్
 బూస్టర్ డోస్ తీసుకున్న జిల్లా కలెక్టర్, జడ్పీచైర్మన్
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)
ఖమ్మం జిల్లాకు కోవిడ్ థర్డ్ వేవ్ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కరోనా నియంత్రణకు ప్రభుత్వం, ప్రభుత్వాధికారులు సర్వం సిద్దంగా ఉన్నామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. కోవిడ్ తీవ్రత, ఓమిక్రాన్ నేపథ్యంలో 15-18 సంవత్సరాల పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్ తో పాటు 60 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్స్, హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వారియకు బూస్టర్ డోస్ నేటి నుండి అందిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నేటి నుండి అందిస్తున్న బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్‌ను జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి మంత్రి ప్రారంభించారు.

also read :-ఐటీ.. మళ్లీ ఇంటి నుంచే పని

కోవిడ్ తీవ్రత మరల పెరుగుతున్న దృష్ట్యా ప్రజల ఆరోగ్య సంరక్షణకు గాను 15 – 18 సంవత్సరాల వయస్సు లోపు పిల్లలకు కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టిందని దీనితో పాటు ఫ్రంట్‌లైన్ వారియర్స్, హెల్త్ వర్కర్స్, సీనియర్ సిటిజను కోవిడ్-19 టీకాలు రెండు డోసులు తీసుకున్న వారికి ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుండి బూస్టర్ డోసను అందిస్తున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.
జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ బూస్టర్ డోస్ కోసం నగరంలో జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితో పాటు నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లు మామిళ్ళగూడెం, ముస్తఫా నగర్, శ్రీనివాసనగర్, వెంకటేశ్వర నగలతో పాటు ఉమెన్స్ కాలేజ్, గాంధీచౌక్ లోని ప్రభుత్వ పి.జి కళాశాల, ఎన్.టి.ఆర్ సర్కిల్ లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శాంతి నగర్ కళాశాల, అంబేద్కర్ గురుకుల కళాశాలల్లో బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మొదటి విడతగా జిల్లాలోని హెల్త్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వారియర్స్, 60 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజనకు కోవిడ్ వ్యాక్సినేషన్ రెండు డోసులు తీసుకొని నిర్దేశిత గడువు ముగిసిన వారికి బూస్టర్ డోసను అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. దీనితో పాటు 15-18 సంవత్సరాల లోపు ప్లిలలకు కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ జిల్లాలో జరుగుతుందన్నారు.

also read :-*నగరాభివృద్ధిలో భాగంగా అన్ని డివిజన్లలో రోడ్లు: మంత్రి పువ్వాడ.

జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, డి.సి.సి.బి చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్,
జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ ను తీసుకున్నారు. అనంతరం హెల్త్ వర్కర్స్ కు, సీనియర్ సిటిజనకు బూస్టర్ డోస్, 15-18 సంవత్సరాల లోపు పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్ టీకాలను వేయడం జరిగింది. నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మాలతి,
జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, వైద్య అధికారులు, తదితరులు పాల్గొన్నారు.