కరోనా మహమ్మారిపట్ల అప్రమత్తంగా ఉండాలి : మంత్రి పువ్వాడ ★
రవాణా ఆన్లైన్ సేవలను వినియోగించుకోవాలి★
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
కరోనా మహమ్మారిప్రబలుతున్న దృష్ట్యా ప్రభుత్వ కోవిడ్ నిబంధనలను పాటించడం ద్వారా కరోనానియంత్రించవచ్చని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. బుధవారం మంత్రిఒక ప్రకటన విడుదల చేశారు. ఒమిక్రాన్ పట్లప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అదే సందర్భంలో అజాగ్రత్త కూడాపనికిరాదన్నారు. ఆర్టీసి బస్సులు, బస్ స్టాండ్ ల్లో, ఆర్టీఏ కార్యాలయాల్లో తప్పనిసరిగా కోవిడ్నిబంధనలను పాటించేలా చర్యల చేపట్టాలని అధికారులను మంత్రి అజయ్ కుమార్ ఆదేశించారు.పండుగ నేపథ్యంలో ప్రయాణం చేసే ప్రయాణికులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ స్వీయనియంత్రణ చర్యలు పాటించాలని తెలిపారు. కార్యాలయాల్లో తమ విధులు నిర్వర్తించే రవాణాశాఖ అధికారులు తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు.
also read :-అకాల వర్షం…. మిరపకు నష్టం….
రిజిస్ట్రేషన్ల ఇతర పనులునిమిత్తం కార్యాలయానికి ప్రజలు రాకుండా అదే విధంగా వారికి ఇబ్బంది కలగకుండాఆన్లైన్ సేవలను వినియోగించుకోవాలని మంత్రి పువ్వాడ సూచించారు. ప్రస్తుత కరోనానేపథ్యంలో ఆన్లైన్ సేవలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించడానికి అధికారులు, సిబ్బంది కృషి చేయాలని ఆర్టీఏ కార్యాలయాల్లో 59 రకాల సేవలు కొనసాగుతున్నాయని మంత్రిపేర్కొన్నారు. రవాణా శాఖలో 17 రకాల సేవలనుకార్యాలయానికి వెళ్లకుండానే పొందే వీలును ప్రభుత్వం కల్పించిందని ఇష్యూ ఆఫ్‌టెంపరరీ పర్మిట్, పునరుద్ధరణకుఅనుమతి, కొత్తవి మంజూరు,క్లియరెన్స్ సర్టిఫికెట్‌జారీ, చిరునామా మార్పు,రిజిస్ట్రేషన్‌సర్టిఫికెట్, లెర్నర్‌లైసెన్స్, డ్రైవింగ్‌లైసెన్స్ ఇతర సేవలు ఈ జాబితాలో ఉన్నందున కరోనా దృష్ట్యా ఈ సేవలను సద్వినియోగంచేసుకోవాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
also read ;-వాజేడు మండలం టేకులగూడెం సమీపంలో చత్తీస్గడ్ నుంచి కూలీలతో వస్తున్న బొలెరో వాహనం బోల్తా….
ప్రైవేట్ ట్రావెల్స్ పై ఆర్టీఏ నజర్.(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)ఒకపక్క సంక్రాంతిసీజన్ కావడంతో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య అందినకాడికి దండుకునే పనిలోఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ వాహనదారులవ్యవహారానికి చెక్ పెట్టేందుకు రవాణాశాఖ అధికారులు రంగంలోకి దిగారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాలమేరకు నిబంధనలకు విరుద్ధంగా, సరైన పర్మిట్లు లేకుండా, ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తూ పొరుగు రాష్ట్రాల మధ్యతిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్ వాహనాలపై నజర్ పెట్టారు. ఇప్పటికే హైదరాబాద్శివార్లలో పలుచోట్ల తనిఖీలను చేపట్టారు. అనేక వాహనాలు పర్మిట్లు లేకుండా, సరైన పాత్రలు లేకుండా, నిబంధనలు విరుద్ధంగా ఉన్న వాహనాలను అదుపులోకితీసుకున్నారు.
also read :ఉద్యోగుల కేటాయింపులు పూర్తి.
పండగ సీజన్‌లో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌బస్సులపై ఈ మేరకు రవాణా శాఖ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. మోటర్ వేహికల్ చట్టంనిబంధనలు అతిక్రమిస్తూ తిప్పుతున్న ప్రైవేట్ వాహనాల అక్రమ రవాణాను అరికట్టేందుకుప్రత్యేకంగా 9 టీంలు రంగంలోకిదిగినట్లు రవాణా శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నట్రావెల్స్ బస్సులు, పర్మిట్లులేకుండా నడుపుతున్న వాహనాలపై దృష్టిసారించి దాడులు నిర్వహిస్తున్నట్లుచెప్పారు. ప్రధానంగా ప్రయివేటు వాహనాలుస్టేజి క్యారియర్లుగా నడపటం, సరియైన పత్రాలు లేకపోవడం వంటి విషయాలపై ఈ దాడులు కొనసాగిస్తూ కేసులు నమోదు చేయడం జరుగుతోందన్నారు. ప్రేవేటువాహనాల డాక్యుమెంట్లను పక్కాగా చెక్ చేయడం జరుగుతోందని, అతిక్రమించిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇలాంటి వాహనాలలో ప్రయాణించడం కూడా శ్రేయస్సుకరంకాదని ప్రజలకు సూచించారు. ప్రైవేట్ట్రావెల్స్ నిర్వహకులు నిబంధనలను అతిక్రమించడం మంచిది కాదని, మోటర్ వాహనాల చట్టం లోబడి నడుచుకోవాలనిఅధికారులు కోరారు.