Telugu News

మండలం లో కరోనా కల్లోలం……

పాజిటివ్ కేసులు 150 పైన.... స్వీయ నియంత్రణ పాటించని ప్రజలు..... వ్యక్తిగతంగా ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లి మందులు వాడుతున్న బాధితులు......

0

మండలం లో కరోనా కల్లోలం……
పాజిటివ్ కేసులు 150 పైన….
స్వీయ నియంత్రణ పాటించని ప్రజలు…..
వ్యక్తిగతంగా ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లి మందులు వాడుతున్న బాధితులు……

(చండ్రుగొండ- విజయం న్యూస్ ):-

మండలం లో కరోనా తీవ్ర రూపం దాలుస్తుంది.. పండగలు, పబ్బాలు పేరుతో ప్రజలు విచ్చలవిడిగా తిరగడంతో మండలం పై కరోనా పంజా విసురుతోంది.. గత కొన్ని రోజులుగా మండలంలో కరోనా బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది… ముఖ్యంగా చాలామందికి వైరస్ వచ్చినప్పటికీ ఎవరికీ తెలియ కుండా బయట తిరుగుతున్నారు… వైరస్ సోకిన వాళ్ళు వారిలో కొందరు రెండు వారాల పాటు ఇంట్లో ఉండకుండా బయటికి వస్తున్నారు… హోటళ్ళు, టీ దుకాణాల వద్ద గుంపులుగుంపులుగా, కనిపిస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు… మద్యం దుకాణాల వద్ద కూడా ఉదయం నుంచి బారులుతీరి కరోనా వ్యాప్తికి మూల కారణం అవుతున్నారు… గ్రామాలలో ముఖ్య కూడళ్లలో పాత రోజులు మాదిరిగానే యువకులు, పెద్దలు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు…. ఆరోగ్య సిబ్బంది కనిపించినప్పుడు మాత్రమే మాస్కులు ధరిస్తున్నారు…. కరోనాపై ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న అవగాహన కార్యక్రమానికి గ్రామాల్లో ఉండే వారు ఎవరు కూడా పాటించడంలేదు..
మండలంలో ఉన్న 14 పంచాయతీల్లో యాక్టివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి… గ్రామాల్లో ప్రజలు స్వీయ నియంత్రణ పాటించకపోవడంతో, అల్లగే వ్యక్తిగతంగా ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవడం వల్ల ఈ వ్యాప్తికి కారణం అవుతున్నాయి….

also read :- ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్‌ లక్ష్యం : మంత్రి పువ్వాడ

మండలంలో చాలా మంది ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, పరిసర పట్టణాలకు వెళ్లి ప్రైవేట్ టెస్టులు చేయించుకుని వచ్చి స్థానికంగా ఉన్న జనాల్లో కలిసి తిరుగుతున్నారు….
ఈవిషయం పై మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాకేష్ కుమార్ ని వివరణగా….. ఇప్పటి వరకు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న గ్రామాల్లో 5584 ఇండ్లను సర్వే చేయగా దగ్గు, జలుబు, జ్వరం ఉన్నవారికి ఇప్పటివరకు 335 మందికి మెడికల్ కి ఇవ్వడం జరిగింది.. 14 రోజులు హోమ్ ఐసోలేషన్ ఉండాలని సూచించామని వారిని ప్రతిరోజు ఏఎన్ఎం, ఆశా వర్కర్లు ప్రతిరోజు వారికి తగిన సూచనలు ఇవ్వాలని తెలిపారు … అదేవిధంగా బయటికి వచ్చే సమయంలో మాస్కు ధరించి, దూరం పాటించాలని, ఏ విధంగా చేతులను శానిటేషన్ చేసుకోవాలని తెలిపారు.. అదేవిధంగా 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి బూస్టర్ డోస్ ఇవ్వడం జరుగుతుందని, మండలంలో బూస్టర్ డోస్ అందుబాటులో ఉన్నాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు… అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ నియమాలు తప్పనిసరిగా పాటించాలి అన్నారు..

also read :-రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచొద్దు – జిల్లా కిసాన్ కాంగ్రెస్