Telugu News

కరోనా భారిన పడి : ప్రముఖ కొరియోగ్రాఫర్‌ – శివ శంకర్‌ మాస్టర్‌ కన్నుమూత.

శివశంకర్ మాస్టర్ కుటుంబం ఆర్ధిక పరిస్థితి బాగోకపోవడంతో నటుడు సోనూసూద్, తమిళ హీరో ధనుష్, మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు సహాయం అందించారు. అయినా మాస్టర్ ప్రాణాలు దక్కలేదు.

0

కరోనా భారిన పడి ఆరోగ్యం విషమించడంతో శివశంకర్ మాష్టర్ కన్నుమూత.

( హైదరాబాద్ – విజయం న్యూస్):- 

శివశంకర్ మాస్టర్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా కరోనా తో బాధపడుతున్న ఆయన కొద్దిసేపటి క్రితమే కన్ను మూశారు. కరోనా బారిన పడిన దగ్గరనుంచి ఆయన ఆరోగ్యం విషమించింది. కరోనా భారిన పడిన ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.

మరోవైపు శివశంకర్ మాస్టర్ భార్యకు కూడా కరోనా సోకడంతో ఆమె హోం క్యారంటైన్లో ఉన్నారు.ఇక మాస్టర్ చిన్న కుమారుడు అజయ్ కృష్ణ తన తండ్రి, అన్న, అమ్మ బాగోగులు చూసుకుంటూ వచ్చారు. శివశంకర్ మాస్టర్ ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకిందని..75శాతం ఇన్ఫెక్షన్ ఉండడంతో ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. శివశంకర్ మాస్టర్ కన్నుమూయడంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ అనారోగ్యంతో ఆదివారం రాత్రి 8 గంటలకు కన్నుమూశారు. కొద్దిరోజుల కిందట ఆయనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.

75శాతం ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఆయన ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఈరోజు తుదిశ్వాస విడిచారు. శివశంకర్ మాస్టర్ కుటుంబం ఆర్ధిక పరిస్థితి బాగోకపోవడంతో నటుడు సోనూసూద్, తమిళ హీరో ధనుష్, మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు సహాయం అందించారు. అయినా మాస్టర్ ప్రాణాలు దక్కలేదు.

కాగా శివశంకర్ మాస్టర్ వయసు 72 ఏళ్లు. ఆయన కొరియోగ్రాఫర్గా దేశంలోని అన్ని భాషల్లో సుపరిచితుడు. తెలుగుతో పాటు 10 భాషలకు పైగానే కొరియోగ్రాఫర్గా పనిచేశారు. ముఖ్యంగా దక్షిణాదిలో పలు చిత్రాలకు ఆయన నృత్యరీతులు సమకూర్చారు.

ఇప్పటి వరకు ఆయన దాదాపు 800 చిత్రాలకుపైగానే డ్యాన్స్ మాస్టర్గా పనిచేశారు. పలుభాషల్లో ఉత్తమ అవార్డులు తీసుకున్నారు. తెలుగులో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర చిత్రానికి ఉత్తమ కొరియోగ్రాఫర్గా జాతీయ ఫిల్మ్ అవార్డు అందుకున్నారు. శివశంకర్ మాస్టర్ మరణవార్త విని పలువురు టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

 

also read :- హుజరాబాద్ ఎమ్మెల్యే , ముదిరాజు ముద్దుబిడ్డ ఈటల రాజేందర్ కు ఘన స్వాగతం