కరోన కోరల్లో గ్రామ పంచాయతీ లు….
పారిశుద్ధ్యాన్ని పట్టించుకోని పంచాయతీలు…
జనసంచారం లో పందుల స్వైర విహారం…
(మణుగూరు టౌన్-విజయంన్యూస్)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం లోని మణుగూరు పట్టణంలో ఒకపక్క కరోనా దేశాన్ని అతలాకుతలం చేస్తున్న సమయంలో మణుగూరు మండలంలోని సమితి సింగారం గ్రామ పంచాయతీ పరిధిలో గల రాజీవ్ గాంధీ నగర్ లో పారిశుద్ధ్యాన్ని పట్టించుకోకపోవడంతో జనసంచారం తో పాటు పందుల స్వైర విహారం చేస్తున్నాయి .
also read :-గడపగడపకు సంక్షేమ ఫలాలు అందాలి….
అయినా పంచాయతీ వారు వాటిని మాత్రం పట్టించుకోవడం లేదు. ఒకపక్కన కరోనతో ప్రజలు పోరాటం చేస్తున్న సమయంలో పంచాయతీ వారి నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యం గా మారిన మురికి గుంటలు కోవిడ్ సమయంలోనూ బ్లీచింగ్ కూడా చేయటం లేదు. ఇప్పటివరకు మురికి గుంటలు దోమలకు మాత్రమే నివాసంగా ఉన్నాయి అది చాలదు అన్నట్లు ఇప్పుడు వాటికి తోడు పందులు కూడా నివాసం ఏర్పరుచుకున్నా యి పరిసర ప్రాంతాలను పాడు చేస్తున్నా పంచాయతీ వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇంటి పన్నుల వసూళ్ల పై ఉన్న శ్రద్ధ పరిసరాల శుభ్రతపై ఎందుకు లేదు. రాజీవ్ గాంధీ నగర్ లో ఉప సర్పంచ్ మరియు వార్డు నెంబరు ఇద్దరు ఉన్నా వీటిని వారు ఎందుకు పట్టించుకోవడం లేదు వీలైనంత త్వరగా ఈ సమస్యలకు పరిష్కారం చూపిస్తారని ఆశిస్తున్నా రాజీవ్ గాంధీ నగర్ వాసులు