కరోనా కొత్త వేరియంట్ : ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం – డీహెచ్ శ్రీనివాసరావు…
మరోసారి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు.
ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం.
డీహెచ్ శ్రీనివాసరావు…
విజయం న్యూస్:-
మరోసారి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు.
ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కొత్త వేరియంట్ పట్ల ప్రభుత్వం అప్రమత్తతతో ఉందని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కొత్త వేరియంట్ కేసులు దేశంలో నమోదు కాలేదన్నారు.
సౌత్ ఆఫ్రికా, బొట్స్వానా, హాంగ్‌కాంగ్‌తో పాటు పలు యూరోపియన్ దేశాల్లో ఒమిక్రాన్ గుర్తించారన్నారు.
ఆయా దేశాల కొత్త వేరియంట్ రాకుండా అడ్డుకునేలా విమానాశ్రయాల్లోనే పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు.
అలాగే జీనోమ్సీక్వెన్సింగ్ చేసే ప్రక్రియను బలోపేతం చేసినట్లు చెప్పారు. ఆయా దేశాల నుంచి వచ్చిన వారికి ప్రత్యేకంగా ఇండ్లకు తరలించి, పాజిటివ్‌గా తేలిన వారికి 14 రోజుల హోం క్వారంటైన్‌కు తరలించడంతో పాటు మానిటరింగ్ చేయనున్నట్లు వివరించారు.
కొవిడ్ వైరస్‌లో వివిధ వేరియంట్లతో పాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నుంచి వ్యాక్సినేషన్ ఒక్కటే కాపాడగలదన్నారు. రాష్ట్రంలో కేసులు కరోనా పెరగడం లేదని, నిలకడగానే ఉన్నాయన్నారు.
also read :-పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థులు ధర్నా..!
also read:- శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ ఆహ్వానం……..