Telugu News

సీఎల్పీనేత భట్టి విక్రమార్కకు కరోనా పాజిటీవ్

ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)

0

సీఎల్పీనేత భట్టి విక్రమార్కకు కరోనా పాజిటీవ్

(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)

సీఎల్పీనేత, మధిర నియోజకవర్గ ఎమ్మెల్యే భట్టి విక్రమార్కకు కరోనా పాజిటీవ్ నిర్థారణ అయ్యింది. సాధాహరణ చెకింగ్ లో భాగంగా ఆదివారం పరీక్షలు చేయించుకోగా అయనకు కోవిడ్ పాజిటీవ్ వచ్చింది. ఈ మేరకు ఆయన తక్షణమే ప్రకటన రూపంలో ప్రజలకు సమాచారం అందించారు. శనివారం, అదివారం తమను కలిసిన ప్రతి ఒక్కరు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆరోగ్యం చాలా నిలకడగా ఉందని, ఎలాంటి లక్షణాలు లేకపోయినప్పటికి కరోనా పాజిటీవ్ రావడంతో హోం హైసోలేషన్ లో ఉంటున్నట్లు తెలిపారు. 15 రోజుల అనంతరం మళ్లీ తిరిగి అందర్ని కలుస్తానని సీఎల్పీనేత భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజలేవ్వరు భయాందోళన చెందోద్దని, ఇబ్బందులు పడోద్దని అన్నారు. నా గురించి ఎవరు భయపడోద్దని, పూర్తిగా పిట్ గానే ఉన్నానని అన్నారు.

also read :-★ ప్రజారవాణాకు ఆటంకంకలిగిస్తే ఉక్కుపాదం